Andhra Pradesh

News October 2, 2024

ప్రకాశం వస్తున్నారా.. అయితే ఇవి చూసేయండి.!

image

దసరా సెలవుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. అయితే ఈ పర్యాటక ప్రదేశాలను మిస్ కావద్దు. జిల్లాలో భైరవకోన, కొత్తపట్నం, రామాయపట్నం, పాకల బీచ్‌లు, వల్లూరమ్మ తల్లి ఆలయం, కంభం చెరువు, మాలకొండ స్వామి ఆలయం, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. దసరా సెలవులు అనగానే మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయండి.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.

News October 2, 2024

రాజమండ్రి: ‘చమురు సంస్థల నుంచి పరిహారం ఇప్పించాలి’

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో విజయవాడలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భేటీ అయ్యారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న పలువురు మత్స్యకారులకు చమురు సంస్థలు నుంచి పరిహారం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులందరికి పరిహారం ఇప్పించాలని కోరారు.

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహాయ యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వరం ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలున్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.

News October 2, 2024

కృష్ణా: రేపు టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులు

image

కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News October 2, 2024

నెల్లూరు: KGBVలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ ఉషారాణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి ఈనెల 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నా.

News October 2, 2024

కడప జిల్లాలో 581 మంది బైండోవర్

image

కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరులో అసాంఘిక కార్యకలాపాలపై ముమ్మరంగా దాడులు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 కేసుల్లో 581 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేసి 204 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరచుకుని, 37 మందిని అరెస్టు చేశామన్నారు. 67 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, రూ.5.96 లక్షలు, 382 మంది జూదరులను అరెస్టు చేశామని తెలిపారు.

News October 2, 2024

గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్

image

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.