India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్‌తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెట్టింగుల కోసం దేశాలు దాటి పామూరు యువకులు జైలు పాలైన సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. నేపాల్ దేశంలో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కాసేందుకు పామూరుకు చెందిన 8 యువకులు బెంగుళూరు నుంచి విమానం ద్వారా నేపాల్‌కి చేరుకున్నట్లు సమాచారం. నేపాల్‌కి వెళ్లెందుకు పాస్‌పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుపై నేపాల్ వెళ్లారు. పోలీసుల పక్కా సమాచారంతో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.