India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సింహాద్రిపురం మండలం బలపనూరులో శుక్రవారం ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని రైతు నాగేశ్వర రెడ్డి (63) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తన రెండు ఎకరాల పొలంలో పంటలు పండక అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు అధికం కావడంతోపాటు తన భార్య అనారోగ్యంతో బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో మనస్థాపం చెందిన నాగేశ్వర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,445 పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమం విజయవంతం అయిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్ధుల ప్రగతితో పాటు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, టీచర్లను, విద్యార్థులను ఆయన కోరారు. ఎస్ఎంసీ సభ్యులు-17,974, ప్రజా ప్రతినిధులు-2,111, అధికారులు-1,751, స్థానిక ప్రతినిధులు-2,395 పాల్గొన్నట్లు తెలిపారు.

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్ నెలల్లో జరిగిన BA LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలోని సంబంధిత కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.

భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.