India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఇంతకుముందు ఇచ్చిన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి లేదా అవి ఇంకా పరిష్కారం కాకపోతే, అర్జీదారులు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని ఆమె సూచించారు.
గుంటూరులో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-14 వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో కర్నూలు క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. 79 కేజీల విభాగంలో ఆఫ్రిది బంగారు పతకం సాధించగా ఫైజాన్, ఇంతియాజ్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ విజేతలను స్టేడియం కోచ్ యూసఫ్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పాపా అభినందించారు.
ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 717 ఆక్రమణలు తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 2,476 ఆక్రమణలు తొలగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా తగరపువలస, మిథిలాపురి, కొమ్మాది, పెదగదిలి, ఆర్‌టీసీ కాంప్లెక్స్, జగదాంబ, దొండపర్తి, గాజువాక, వడ్లపూడి, నెహ్రూ చౌక్, ప్రహలాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు.
విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ నిర్వహించనున్నట్లు సిపి శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగర ప్రజలు లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్,క్రైమ్ సంబంధిత సమస్యలపై నేరుగా తనకు ఫిర్యాదు అందించవచ్చని వెల్లడించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
☞ పెనమలూరు హెడ్ కానిస్టేబుల్‌కు ప్రశంసలు
☞ కృష్ణా: పల్లెకు కదిలిన పట్టణ వాసులు
☞ కానూరు: వైన్ షాపులో గొడవ.. ఒకరి మృతి
☞ కృష్ణా : డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
☞ దుర్గ గుడికి తక్కువ సామానుతో రండి: NTR కలెక్టర్
☞ దుర్గగుడిలో భక్తులకు క్యూఆర్ సేవలు: NTR కలెక్టర్
జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
మందస మండలం కొర్రాయిగేట్ సమీపంలో NH16 రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని శ్రీకాకుళం RIMS హాస్పిటల్‌లో మార్చురీ గది వద్ద ఆచూకీ కోసం ఉంచారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు మందస స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.
కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.05కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి నగరంలోని ప్రైవేట్ హోటల్‌కి చేరుకుని 3 నుంచి 4.30 వరకు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.
Sorry, no posts matched your criteria.