Andhra Pradesh

News December 9, 2025

విద్యార్థుల్లో నైపుణ్యాల కోసమే బాలోత్సవాలు: విశాఖ DEO

image

విశాఖ బాలోత్సవం సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి ఎన్.ప్రేమ్ కుమార్ దీనిని ప్రారంభించగా.. రోటరీ గవర్నర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. మొదటి రోజు వివిధ విభాగాల్లో 27 అంశాలపై పోటీలు నిర్వహించారు.

News December 9, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘Gen-Z’ పోస్టాఫీసు ప్రారంభం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలోనే తొలి ‘Gen-Z’ థీమ్డ్ పోస్టాఫీసును వీసీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్, పోస్ట్ మాస్టర్ జనరల్ జయశంకర్ మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులు, పరిశోధకుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ కౌంటర్లు, వేగవంతమైన పార్శిల్ సేవలతో ఈ ఆధునిక పోస్టాఫీసును తీర్చిదిద్దారు. ఇది విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి, ప్రాజెక్టుల పనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీసీ పేర్కొన్నారు.

News December 9, 2025

విశాఖలో రేపటి నుంచి టెట్ పరీక్షలు

image

విశాఖలో రేపటి నుంచి ఈనెల 21 వరకు 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26,248 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షల కోసం బస్సులు, విద్యుత్, వైద్యం వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల సహాయార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్లు (9177292969, 9618584051) కూడా అందుబాటులో ఉంచామన్నారు.

News December 9, 2025

VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్‌గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News December 9, 2025

SKLM: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఈనెల 13న అన్ని కోర్టుల్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, భూతగాదాలు రోడ్డు ప్రమాదాలు బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు విషయంలో వీలైనంతవరకు ఎక్కువమంది రాజీ పడే విధంగా సంబంధిత అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.

News December 9, 2025

ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

image

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

News December 9, 2025

ప్రకాశం: రేపటి నుంచి టెట్ పరీక్షలు..!

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో టెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు, 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News December 9, 2025

క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

image

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.

News December 9, 2025

బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

image

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్‌ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.