Andhra Pradesh

News December 10, 2025

ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

image

క్రిస్మస్‌, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.

News December 10, 2025

శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

image

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్‌ రైస్ పుల్లింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.

News December 10, 2025

విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

image

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.

News December 10, 2025

కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

image

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

News December 10, 2025

కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

image

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్‌లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్‌లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్‌లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్‌పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.

News December 10, 2025

VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

image

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్‌.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.