Andhra Pradesh

News October 2, 2024

నెల్లూరు: KGBVలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీసీ ఉషారాణి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి ఈనెల 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నా.

News October 2, 2024

కడప జిల్లాలో 581 మంది బైండోవర్

image

కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరులో అసాంఘిక కార్యకలాపాలపై ముమ్మరంగా దాడులు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 కేసుల్లో 581 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేసి 204 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరచుకుని, 37 మందిని అరెస్టు చేశామన్నారు. 67 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, రూ.5.96 లక్షలు, 382 మంది జూదరులను అరెస్టు చేశామని తెలిపారు.

News October 2, 2024

గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్

image

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.

News October 2, 2024

శ్రీకాకుళం: గిల్టు నగలకు రూ.16 లక్షల రుణం

image

శ్రీకాకుళంలోని ఓ బ్యాంకులో అప్రైజర్‌ అవినీతి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు..గిల్ట్ నగలు తన బంధువుల పేర్ల మీద తాకట్టు పెట్టి రూ.16 లక్షల రుణం తీసుకున్నారు. గుర్తించిన అధికారులు రూ.1.50 లక్షలు రికవరీ చేయగా..మిగిలింది కట్టకుండా కాలయాపన చేస్తుండడంతో సిబ్బంది అతనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. మంగళవారం పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేవని ఫిర్యాదు తీసుకోలేదని ఎచ్చెర్ల సీఐ తెలిపారు.

News October 2, 2024

ప్రకాశం జిల్లాలో దసరాకు 136 ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు

image

దసరా సందర్భంగా ఈ ఏడాది ప్రయాణికుల సౌకర్యార్థం 136 సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి బి సుధాకరరావు తెలిపారు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు అన్ని డిపోల నుంచి 136 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రానుపోను ఒకేసారి టికెట్‌ రిజర్వు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.

News October 2, 2024

నెల్లూరు జిల్లాలోని టెట్ పరీక్ష కేంద్రాలు ఇవే..

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల నిర్వహణ కోసం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు DRO తెలిపారు.
వాటి వివరాలు:
➥ నెల్లూరు నగరం ముత్తుకూరు రోడ్డులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల
➥పొట్టేపాలెం సమీపంలో గల అయాన్ డిజిటల్ జోన్
➥కావలి ఉదయగిరి రోడ్డులో గల విశ్వోదయ కళాశాల
➥కడనూతల RSR ఇంజినీరింగ్ కళాశాల

News October 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా మంగళవారం 63,300 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.4.23 కోట్లు నిన్న హుండీ రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 2, 2024

తూ.గో.: నేడు యథావిధిగా పనిచేయనున్న విద్యాసంస్థలు

image

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం తెలిపారు. దసరా సందర్భంగా మూడవ తేదీ గురువారం నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత నెల 2న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు బుధవారం విద్యా సంస్థలకు సెలవు రద్దు చేసినట్లు తెలిపారు.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

News October 2, 2024

విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే

image

మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.