India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారానికి 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కింది స్థాయి నాయకులను పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప MLA మాధవిరెడ్డిపై సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇక మైదుకూరు MLA పుట్టా సుధాకర్ కూడా వీకెండ్ MLAగా నియోజకవర్గంలో పర్యటించండంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్‌వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. పదవి బాధ్యత కార్యక్రమంలో బాలినేని పేరెత్తి మరీ జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పవన్ ప్రకటించగా.. ఈ జాబితాలో బాలినేని పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీలో కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయట.

తల్లికి వందనం ఇప్పించాలంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాకు పొదలకూరు (M) నల్లపాలనేకి చెందిన కీర్తన, మేరీ బ్లెస్సీ గ్రీవెన్స్‌లో తమ గోడు విన్నవించుకున్నారు. తమకు తల్లిదండ్రులు లేరని తల్లి మూడేళ్ల కిందట చనిపోయిందని, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ భార్య హత్య చేసింది. ఈ ఘటన HYDలోని బోడుప్పల్‌లో జరిగింది. అక్కడ నివసించే అశోక్(45), పూర్ణిమ(36) భార్యాభర్తలు. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కూలీ మహేశ్(22)తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 11న అశోక్‌ను పూర్ణిమ, మహేశ్, సాయికుమార్ కలిసి కింద పడేసి చున్నీలతో గొంతు బిగించి హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించినా, పోలీసుల విచారణలో నిజం తేలింది.

విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఆపై బ్యాటర్ల నిలకడైన ఆటతీరుతో భారత్ 8 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మేరకు నిన్న నెట్స్‌లో టీం చెమటోడ్చారు.

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.

విశాఖలో మంగళవారం నుంచి పీసా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ బీచ్ రోడ్‌లో గల కాళీమాత టెంపుల్ వద్ద PESA రన్ ప్రారంభించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. IAS అధికారులు ముక్తా శేఖర్, శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, ముత్యాల రాజు ఉన్నారు.

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.