Andhra Pradesh

News December 23, 2025

ప్రకాశం జిల్లాలో యూరియాకై ప్రణాళిక సిద్ధం

image

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్‌కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.

News December 23, 2025

దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్‌కు సన్మానం

image

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్‌ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 23, 2025

చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

image

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

News December 23, 2025

సింహాచలం: ఆన్‌లైన్‌‌లో వైకుంఠ ఏకాదశి టికెట్లు

image

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఈవో సుజాత సోమవారం తెలిపారు. 100,300,500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి టికెట్లు ఆన్‌లైన్‌‌లో మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు గమనించాలని సూచించారు.

News December 23, 2025

ప.గో: గుడ్ న్యూస్ చెప్పిన జేసీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News December 23, 2025

ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

image

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.

News December 23, 2025

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.

News December 23, 2025

రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్‌కు కొదువ లేకుండా చూడాలన్నారు.

News December 23, 2025

వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

image

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.

News December 23, 2025

వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

image

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.