Andhra Pradesh

News October 2, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా మంగళవారం 63,300 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.4.23 కోట్లు నిన్న హుండీ రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 2, 2024

తూ.గో.: నేడు యథావిధిగా పనిచేయనున్న విద్యాసంస్థలు

image

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం తెలిపారు. దసరా సందర్భంగా మూడవ తేదీ గురువారం నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత నెల 2న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు బుధవారం విద్యా సంస్థలకు సెలవు రద్దు చేసినట్లు తెలిపారు.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

News October 2, 2024

విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే

image

మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.

News October 2, 2024

4న VSUలో జాబ్ మేళా

image

నెల్లూరు VSUలో ఈనెల 4న AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ VC విజయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 2, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti

News October 2, 2024

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 2, 2024

ప్రకాశం: 97.02 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పెన్షన్ల పంపిణీ విజయవంతంగా అధికారులు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,88,144 మందికి గాను 2,79,365 మందికి పింఛన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. మొత్తం 97.02 శాతం పంపిణీ చేసినట్లు వివరించారు. మిగతా పింఛన్లు గురువారం పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

News October 2, 2024

VZM: రేపటి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు.. జిల్లాలో ఐదు కేంద్రాలు

image

రేపటి నుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూటలా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 .30 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 22,889 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల ఇన్‌ఛార్జ్‌గా ఆర్డీవో దాట్ల కీర్తి వ్యవహరించనున్నారు.

News October 2, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రానన్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.