Andhra Pradesh

News December 27, 2025

ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

image

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.

News December 27, 2025

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

News December 27, 2025

చీనీ పంటలో తెగుళ్లు

image

అనంతపురం జిల్లాలో చీనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి మొదలైనప్పటి నుంచి పంటకు మంగు తెగులు, పొలుసు పురుగు ఆశించడంతో కాయ నల్లగా మారుతోంది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. తాడిపత్రి పరిధిలో చీనీ పంట అధిక సంఖ్యలో సాగులో ఉంది. తెగుళ్ల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు.

News December 27, 2025

కొత్త ఏడాదిలో.. పాత సమస్యలకు ఎండ్ కార్డు పడేనా..!

image

గుంటూరు జిల్లా ఎన్నో ఏళ్లుగా మౌలిక వసతుల లోపాలతో ముందుకు సాగుతోంది. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తలెత్తడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఎన్నికల సమయంలో హామీలు వినిపిస్తున్నప్పటికీ, సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కొత్త ఏడాదిలోనైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News December 27, 2025

ప్రకాశం: CMపై అసభ్యకర పోస్టులు.. టీచర్‌పై కేసు

image

సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీచర్ పై శుక్రవారం కేసు నమోదైనట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. కనిగిరికి చెందిన టీచర్ శ్రీనివాసులు చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియోలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 27, 2025

ఇంగ్లీషు జర్నలిజంలో యలవర్రు నుంచి ఢిల్లీ దాకా

image

ఆంగ్ల జర్నలిస్ట్ DAగా ప్రసిద్ధులైన ధూళిపూడి ఆంజనేయులు 1924లో యలవర్రులో జన్మించారు. విద్యార్థిదశ నుంచి ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆసక్తితో రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఆయన జర్నలిస్టుగా క్వెష్ట్, ఇండియన్ రివ్యూ, థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాంషియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే వంటి పత్రికలకు రచనలు చేశారు.
@నేడు ఆయన వర్ధంతి.

News December 27, 2025

కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News December 27, 2025

విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

image

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

News December 27, 2025

జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్లోనే: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతి ఫైల్‌ను ఈ-ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జనవరి 15 నుంచి ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టం చేశారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులకు సూచించారు.

News December 27, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు GOOD NEWS

image

జిల్లాలో NTR భరోసా పింఛన్లను జనవరి 1కు బదులు డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి జిల్లాలో 2,71,697 మంది లబ్ధిదారులకు రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులు 30న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సిబ్బంది ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు.