Andhra Pradesh

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 24, 2025

విశాఖలో 16వ శతాబ్ధం నాటి ఆనవాళ్లు!

image

విశాఖ మధురవాడ 7వ వార్డు పరిధి సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణ పనుల్లో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ఫాల్గుణ రావు ఆధ్వర్యంలో బృందం స్థలాన్ని పరిశీలించి, ఈ విగ్రహం పురాతన రాతితో తయారైనదిగా, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. మిగతా భాగం రాముని విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

News December 24, 2025

99.21 % పల్స్ పోలియో వ్యాక్సిన్ నమోదు: DMHO

image

జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 99.21% మంది చిన్నారులకు చుక్కల మందు ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 0-5 సం.లలోపు చిన్నారులకు తొలిరోజు 2,83,173, 2వ రోజు 4,461, 3వ రోజు 4,628 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.

News December 24, 2025

GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

image

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

News December 24, 2025

ప.గో: నేడు స్వగ్రామానికి జవాన్ రాజశేఖర్ భౌతికకాయం

image

విధి నిర్వహణలో మరణించిన పెనుమంట్ర(M) పొలమూరుకు చెందిన జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు బుధవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో ఉదయం 10 గంటలకు వడలి, పెనుగొండ, మార్టేరు మీదుగా భారీ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకురానున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

News December 24, 2025

జనవరి నుంచి చిత్తూరు మరింత చిన్నదాయే.!

image

జనవరి ఫస్ట్ వీక్‌లో మదనపల్లె జిల్లాను ప్రారంభించే అవకాశం ఉంది. CTR, అన్నమయ్య జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట. దీంతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెతోపాటూ పుంగనూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలతో కొత్త జిల్లా ఏర్పడనుంది. చిత్తూరు జిల్లా 32 మండలాల నుంచి 28కి పరిమితం కానుంది.

News December 24, 2025

కర్నూలు SP కీలక నిర్ణయం

image

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

News December 24, 2025

GNT: ఆస్తి నీటి పన్నులు వసూళ్లలో వెనుకబడిన జిల్లా

image

గుంటూరు GMC సహా జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఆస్తి, నీటి పన్నులు రూ.510.41 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు 29.14 శాతం అంటే 148.74 కోట్లు వసూలు చేశారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్లోనే రూ.260.29 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడ 25.55 శాతమే వసూలు కావడం గమనార్హం. గత ఏడాది కంటే పన్ను వసూళ్లలో వెనుకబడి ఉంది. తెనాలిలో 41.79, మంగళగిరి – తాడేపల్లిలో 62.29, పొన్నూరులో 49.01 శాతం వసూలు చేశారు.

News December 24, 2025

నెల్లూరు: మరింత వేగంగా విజయవాడకు.!

image

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్‌కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారిలో 280కి.మీ మేర మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. సరకు రవాణాతోపాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకల కోసం కేంద్రం నాలుగో లైన్‌ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది పూర్తి అయితే VJD-GDR మధ్య రవాణా సమయం మరింత తగ్గనుంది. కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.

News December 24, 2025

విశాఖ: 13 ఏళ్ల క్రితం మహిళ మిస్సింగ్.. కేసును చేధించిన పోలీసులు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును చేధించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.