India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ఫలితాలను తన ఛాంబర్‌లో విడుదల చేశారు. 1,254 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 1012 మంది (80.70%) ఉత్తీర్ణులయ్యారన్నారు. సప్లమెంటరీలో 409 మంది పరీక్షలు రాయగా 279 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సోషల్ మీడియాలో దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురుపాడుకు చెందిన అమిత్ హరిప్రసాద్‌ను పాలకొల్లు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం పాలకొల్లు పీఎస్‌లో మీడియాకు వివరాలు తెలిపారు. హరిప్రసాద్ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై బీసీ నాయకుడు ధనాని సూర్య ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
జీవీఎంసీలో డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది. 74 ఓట్లతో అవిశ్వాసంపై ఓటింగ్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. సరిగ్గా వారం క్రితం మేయర్‌పై అవిశ్వాసం గెలిచిన కూటమి ప్రభుత్వం నేడు డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా గెలిచింది. దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
సముద్రంలో వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారుల జీవనోపాధికై రూ.20వేలు చొప్పున భృతిని శనివారం అందజేయనున్నారు. జిల్లాలో 2,263 మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉండగా 13,077 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20వేలు చొప్పున రూ.26.15కోట్లు మంజూరైనట్టు మత్స్య శాఖ జేడీ తెలిపారు. ఈ మొత్తాన్ని మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్ కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా అందజేయనున్నారు.
గుంటూరు కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పింఛన్ పంపిణీ సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన పంపిణీలో కొన్ని లోపాలు తేలినట్లు పేర్కొంటూ, వృద్ధులను గౌరవంతో చూడాలని, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ నగదు ఇవ్వాలని ఆదేశించారు. అవినీతి, అమర్యాదలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ తెలిపింది. మే 24 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. మే 26 నుంచి 30 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు గమనించాలని కోరింది.
‘అమ్మ వేరొకరితో ఉంటుంది. అతను మమ్మల్ని బెల్టుతో కొడుతున్నాడు. ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం. మా నాన్నకు అప్పగించండి, లేకుంటే అమ్మ మమ్మల్ని చంపేస్తుంది’ అంటూ రాజానగరం(M) కొంతమూరు చెందిన తేజకిరణ్ (10) భానుప్రకాశ్(8) అనే చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. గ్రామానికి చెందిన మహిళకు ప్రవీణ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడగా.. పిల్లలను పట్టించుకోకుండా వారిని కొడుతున్నారని SI నారాయణమ్మ తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం అధికమవుతోంది. శుక్రవారం 4 మండలాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నగరి, తవణంపల్లెలో 41.2, శ్రీరంగరాజపురం-41, సదుం-40.7, చిత్తూరులో 39.4, బంగారుపాలెం-38.7, యాదమరి-38.6, పులిచెర్ల, పూతలపట్టు, సోమల, వెదురుకుప్పం-38.4, రొంపిచెర్ల-38.1, గంగవరం, పెద్దపంజాణి-38, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురంలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఈనెల 30న ఉయ్యూరు AG&SG సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు నైపుణ్య అభివృద్ధి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజ్యూమ్, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.
ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస(M) ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 21న మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికి 5 రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి మృతదేహం స్వగ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.