Andhra Pradesh

News May 7, 2025

విశాఖ డిప్యూటీ మేయర్‌పై నేడు అవిశ్వాసం

image

విశాఖ డిప్యూటీ మేయర్ జీయ్యని శ్రీధర్‌పై నేడు అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో ఈ అవిశ్వాసం ఉండనుంది. అయితే ఇప్పటికే కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు జిల్లా కలెక్టర్ అవిశ్వాసం ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే జీవీఎంసీ మేయర్ పీఠంను కూటమి కైవసం చేసుకోవడంతో, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గుతామని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News May 7, 2025

గుంటూరు జిల్లా చిన్నారులకు గిన్నిస్ రికార్డు

image

గుంటూరు ఖ్యాతిని చాటుతూ నలుగురు చిన్నారులు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. బోరుపాలెంకు చెందిన సంవేద్ కేవలం 50 సెకన్లలో అత్యంత వేగంగా సరళి స్వరాలు ఆలపించి అబ్బురపరిచాడు. తుళ్లూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు ఆధ్య, ఆరాధ్య పియానో విన్యాసంతో మెస్మరైజ్ చేయగా, తెనాలికి చెందిన అభిషేక్ తన మ్యూజిక్ టాలెంట్‌తో గిన్నిస్ ఘనత సాధించాడు. విజయవాడలో శుక్రవారం వీరికి ఆ రికార్డుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

News May 7, 2025

ఇరగవరం: సొసైటీ కార్యదర్శి మృతిపై అనుమానాలు!

image

ఇరగవరం(M) కొత్తపాడు సొసైటీ కార్యదర్శి చల్లా సాయిబాబా మృతి ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. అవి వెలుగులోకి వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.

News May 7, 2025

ఏఈపీఎస్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ఏఈపీఎస్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలతో నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మోసాల నుంచి రక్షణ కోసం ఎంఆధార్ యాప్‌ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసి, వెంటనే మళ్లీ లాక్ చేయాలని, ఇటీవలి కాలంలో వేలిముద్రలు వినియోగించిన చోట్ల డీలింక్ చేయాలన్నారు. మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

News May 7, 2025

విశాఖలో టిడ్కో ఇళ్లపై విచార‌ణ‌కు ఆదేశం

image

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మంజూరు, రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌లో ప‌లు అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని పలువురు విశాఖ ప్ర‌జా ప్ర‌తినిధులు మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప్ర‌త్యేక క‌మిటీ ద్వారా విచార‌ణ చేయించాల‌ని క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్రసాద్‌కు మంత్రి సూచించారు. నిజనిర్ధార‌ణ చేయాల‌ని, అవకతవకలపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

News May 7, 2025

శ్రీకాకుళం జిల్లాకు వరాలు కురిపిస్తారా?

image

మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు CM చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పి వలసలు అరికట్టేలా ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైడిభీమవరంలో పారిశ్రామికవాడ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

News May 7, 2025

విశాఖలో మే 8న తలసేమియా రన్: నారా భువనేశ్వరి

image

తలసేమియా బాధితులు కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో 3k,5k,10k రన్ నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. తలసేమియాపై అవగాహన కలిగించేందుకు విశాఖ వేదికగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ 4నెలలకు ఒకసారి రక్తదానం చేసి, వారికి భరోసా కల్పిద్దామని భువనేశ్వరి అన్నారు.

News May 7, 2025

పాకిస్థాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: ఎస్పీ 

image

గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.  

News May 7, 2025

శ్రీకాకుళం: 27న మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ ఉరిటి సాయి కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ చేపడుతున్న ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారు మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు.

News May 7, 2025

మొగల్తూరు: యువకుడి కాలులోకి చొచ్చుకుపోయిన ఊస

image

మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో శుక్రవారం బిల్డింగ్ స్లాబ్ సెంట్రింగ్ ఊడతీస్తుండగా ప్రమాదవశాత్తు యువకుడు పైనుంచి కింద పడిపోయారు. ఆసమంలో అతని కాలు తొడ భాగంలో ఇనుప ఊస చొచ్చుకుని పోయింది. నరసాపురం మండలం కొండవీటి కొడపకి చెందిన చామకూరి వెంకట గణేశ్ పని చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. సకాలంలో 108 సిబ్బంది ఊసలు కట్ చేసి వైద్యం నిమిత్తం పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.