Andhra Pradesh

News September 21, 2025

విజయనగరంలో కేజీ చికెన్ రూ.200

image

సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని భట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా. చికెన్ (స్కీన్) రూ.200, (స్కీన్ లెస్) రూ.220, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

News September 21, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ. 240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ. 240, స్కిన్‌లెస్ రూ. 260కు అమ్ముతున్నారు. మటన్ ధర పట్టణంలో కిలో రూ.1000 ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 21, 2025

విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

image

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.

News September 21, 2025

సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు: చిత్తూరు DEO

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.

News September 21, 2025

కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

image

కోటబొమ్మాళిలో వెలసి ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులు పాల్గొన్నారు.

News September 21, 2025

అతిధి ప్రోటోకాల్ సక్రమంగా చూడాలి: మంత్రి

image

పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం అమ్మవారి పండగ, ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారుల పై గుంతలు లేకుండా చూడాలని, అతిధుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

News September 21, 2025

ఎస్.కోట: పిడుగుపాటుతో మహిళ మృతి

image

ఎస్.కోట మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి సింబోయిన చెల్లమ్మ అనే గిరిజన మహిళ మృతి చెందింది. ఎస్.కోట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో 15 సంవత్సరాలుగా భర్త కొత్తయ్యతో కలిసి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. శనివారం పొలానికి వెళ్లిన ఆమె రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో భర్త వెళ్లి చూడగా పాకలో చనిపోయి ఉంది. సాయంత్రం పిడుగు పడి మృతి చెందినట్లు గుర్తించారు.

News September 21, 2025

ప్రకాశం: దసరా సెలవులు.. తస్మాత్ జాగ్రత్త.!

image

ప్రకాశం జిల్లాలోని పాఠశాలలకు నేటి నుంచి వచ్చే నెల 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇటీవల వర్షాల వల్ల వాగులు, వంకలు, కుంటలు, చెరువల్లోకి నీరు చేరింది. పిల్లలు సరదాగా ఈత కోసం అటువైపు వెళ్లే అవకాశం ఉంది. చిన్నారులు బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు నీటి వైపు వెళ్లకుండా చూడాలని జిల్లా పోలీస్ శాఖ కోరుతోంది.

News September 21, 2025

చెరువులను నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని మిగిలిన 206 చెరువులు నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలులోని కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 21, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అమూల్య ఎంపిక

image

అనంతపురం జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన చూపిన గుంతకల్లుకు చెందిన బి.అమూల్య రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె.. ఈనెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొననుంది. విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అమూల్యను పలువురు అభినందించారు.