Andhra Pradesh

News April 2, 2024

విజయవాడ: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

image

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్‌కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

News April 2, 2024

తిరుపతి జిల్లాకు రానున్న సీఎం జగన్

image

తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

News April 2, 2024

విజయనగరం ఎంపీగా నెగ్గేదెవరు?

image

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు కాగా 3 విభిన్న పార్టీల అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో TDP నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో YCP నుంచి బెల్లాన చంద్రశేఖర్ MPలుగా గెలిచారు. ఈ సారి YCP నుంచి బెల్లాన మరోసారి పోటీచేస్తుండగా, TDP ఉమ్మడి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో దిగారు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో కామెంట్ చేయండి.

News April 2, 2024

గుంటూరు రైల్వే డివిజన్ చరిత్రలో ఇదే ప్రథమం

image

గుంటూరు రైల్వే డివిజన్‌కు 2024 మార్చి నెలలో రూ.47.9 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అధికమన్నారు. 3.364 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 21.6% వృద్ధి చెందిందన్నారు. దశాబ్దాల చరిత్ర తిరగరాసిందని తెలిపారు.

News April 2, 2024

ప్రకాశం: అక్కడ వైసీపీ ఖాతా తెరవలేదు

image

జిల్లాలో YCP ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసింది. 2014లో మొత్తం 12 స్థానాలకు గాను 6 చోట్ల.. 2019లో 8 చోట్ల గెలిచింది. పర్చూరు, చీరాలలో YCP ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్, TDP నుంచి ఏలూరి సాంబశివ రావు, పర్చూరులో యడం బాలాజీ TDP నుంచి కొండయ్య బరిలో ఉన్నారు. ఈసారి TDP పట్టు నిలుపుకుంటుందా, YCP పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.

News April 2, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని ‘మాస్టర్ ఆఫ్ లాస్’ కోర్సు(LLM) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2022 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. ఏప్రిల్ 15, 16, 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News April 2, 2024

శ్రీకాకుళం: REWIND: ద్విసభ్య విధానం అంటే?

image

ఇద్దరేసి సభ్యులు ప్రాతినిధ్యం వహించే వాటిని ద్విసభ్య నియోజకవర్గాలు అంటారు. ఇవి పార్లమెంటుకే కాక, రాష్ట్ర శాసనసభలకూ ఉండేవి. బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్వాతంత్రం తరువాత కూడా కొనసాగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. ఈవ్యవస్థలో లోపాలు ఉండటంతో కాంగ్రెస్ 1961లో రద్దు చేసింది. 1952లో పాతపట్నం ద్విసభ్య ఎన్నికలు జరిగాయి.

News April 2, 2024

అన్నను హత్య చేసిన దుర్మార్గుడివి నువ్వు: BC జనార్దన్ రెడ్డి

image

బనగానపల్లె ఎమ్మెల్యే కొడుకు ఓబుల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ఒరే ఓబుల్ రెడ్డి లఫూట్. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మీ అన్న నాగార్జున రెడ్డిని రాత్రికి రాత్రి గొంతు నులిమి ఫ్యానుకు వేలాడిదీసినావ్. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మా అన్న గురించి, మా కుటుంబం గురించి. ఆస్తి కోసం హత్య చేసిన దుర్మార్గుడిని నువ్వు’ అని ఆరోపించారు.

News April 2, 2024

అనంత: గుండెపోటుతో యువ రైతు మృతి

image

చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో సోమవారం రాత్రి యువ రైతు దొడ్డి నారాయణ(45) గుండెపోటుతో మృతిచెందారు. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం రాత్రి తన పొలానికి వెళ్లగా హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News April 2, 2024

తాడికొండలో అత్యధిక మెజారిటీ ఇదే..

image

1967లో ఏర్పడ్డ తాడికొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 1983లో టీడీపీ తరఫున దివంగత జే.ఆర్. పుష్పరాజ్ 26486 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ నుంచి బరిలో ఉండగా.. వైసీపీ మేకతోటి సుచరితకు టికెట్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో జే.ఆర్. పుష్పరాజ్ రికార్డు బ్రేక్ అయ్యేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.