India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు గురువారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అదే విధంగా సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని తెలిపారు. నేటి వరకు రూ. 6.74 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.

CM జగన్ మేమంతా సిద్ధం శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9:00 గంటలకు ధూళిపాళ్ల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా మధ్యాహ్నం హౌసింగ్ బోర్డుకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు బైపాస్‌కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

రుషికొండ బీచ్‌లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌కు చెందిన తేజ (20) గురువారం సాయంత్రం తన స్నేహితులతో రుషికొండ బీచ్‌కు వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో వారు స్నానాలకు దిగారు. పెద్ద కెరటం రావడంతో తేజా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డ్స్ గాలించినప్పటికీ తేజ ఆచూకీ లభ్యం కాలేదు. బ్లూకోర్టు పోలీసులు గాలిస్తున్నారు. తేజ ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.

రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా జిల్లాలో గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా గాజువాక నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన వివిధ కంట్రోల్‌రూమ్‌లను, అనుమతి జారీ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికల నేపధ్యంలో ఈవీఎం, వీవీపాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 12న (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ర్యాండమైజేషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జిల్లాలోని 1743 పోలింగ్ స్టేషన్లకు 4184 బ్యాలెట్ యూనిట్లు, 4184 కంట్రోల్ యూనిట్లు, 4534 వీవీప్యాట్స్ సిద్ధం చేస్తున్నామన్నారు.

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని గురువారం సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. అనంతరం శ్రీ మఠం రథోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు సుమన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

బీసీల భద్రతే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని టీడీపీ కూటమి తమ మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగిందని పులివెందలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. తొండూరులో నిర్వహించిన జయహో బీసీ సభలో వారు మాట్లాడారు. కూటమికి బీసీలే వెన్నెముక అన్నారు. బీసీలంటే బలహీనులు కాదని బలవంతులన్నారు.

బుక్కరాయసముద్రం (మం) భద్రంపల్లిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పాల్గొన్నారు. స్మశాన వాటిక లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్ల నుంచి స్మశాన వాటిక సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని గ్రామస్థులు వాపోయారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భద్రంపల్లి ప్రజలకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్, బైండోవర్ షరతుల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తగాదాలు పడవద్దని, పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.