Andhra Pradesh

News April 5, 2024

శ్రీగిరిపై రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో శనివారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల్లో భ్రమరాంబ దేవికి ప్రత్యేక అలంకారాలు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

News April 5, 2024

గుంటూరు మిర్చి యార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు వచ్చాయి. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారు. శని, ఆది వారాలు వారాంతపు సెలవులు కావడంతో క్రయవిక్రయాలు జరగవు.వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజుల పాటు క్రయవి క్రయాలు జరగవని, సోమవారం యథావిధిగా విక్రయాలు జరుగుతాయని ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

News April 5, 2024

గిద్దలూరు MLA అన్నా రాంబాబు పై కేసు నమోదు

image

గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

News April 5, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో పలువురు జడ్జిల బదిలీ

image

ఉమ్మడి అనంత జిల్లాలోని పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం కోర్టులో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి దీన ఒంగోలు సివిల్‌ జడ్జిగా అనంతపురం బదిలీ అయ్యారు. పెనుకొండ కోర్టులో పనిచేస్తున్న సివిల్‌ జడ్జి శంకర్రావును అనంతపురం సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, బొబ్బిలిలో సివిల్‌ జడ్జిగా ఉన్న వాసుదేవన్‌ను పెనుకొండకు బదిలీ చేశారు.

News April 5, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అవుట్ పోస్టులో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డేపల్లి గన్నయ్య(44) గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో భాగంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టగా చనిపోయారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్సై కేసు నమోదు చేశారు.  

News April 5, 2024

ఆళ్లగడ్డ: 5సార్లు ఎన్నికలబరిలో నిలిచి.. గెలిచి

image

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభానాగిరెడ్డిది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 5 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిపొందారు. 2009 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే 1997లో టీడీపీ ఎమ్మెల్యేగా 46959 అత్యధిక ఓట్ల మెజార్టీ, 2012లో 36795 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఆళ్లగడ్డలో ఈ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి

News April 5, 2024

CTR: న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

image

చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)గా నియమిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వెన్నెలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

News April 5, 2024

నెల్లూరు: న్యాయమూర్తుల బదిలీ

image

నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.