Andhra Pradesh

News April 2, 2024

వాలంటీర్లకు పల్నాడు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

మొబైల్‌లు, బయోమెట్రిక్‌ డివైజ్‌లు పోగొట్టుకుంటే వాలంటీర్లు కొత్త IRIS, బయోమెట్రిక్‌ డివైజ్‌ను కొనుగోలు చేసి సంబంధిత సెక్రటరీకి అప్పగించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఏదైనా నష్టం, మొబైల్‌కు డ్యామేజ్ జరిగితే వాలంటీర్లు రూ.8 వేలు చెల్లిస్తే కొత్త మొబైల్‌ అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సూచనలను పాటించాలని ఆదేశించారు.

News April 2, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సాధారణ ఎన్నికలు – 2024 కోసం ఎచ్చెర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఇతర ముఖ్య అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈవిఎమ్, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, 24 గంటలు కాస్టింగ్ జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

News April 2, 2024

వెంకటగిరి: పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు మృతి

image

తనకు రావాల్సిన పింఛను కోసం తిరుపతి నుంచి వెంకటగిరిలోని బంగారు పేటకు 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య వచ్చాడు. పింఛన్ విషయం కనుక్కునేందుకు ఎండలో సచివాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News April 2, 2024

ప్రకాశం: వాహన తనిఖీల్లో రూ.3.20 లక్షలు సీజ్

image

చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.3.20 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ఫ్లయింగ్ స్కాడ్‌తో కలిసి నగదును జిల్లా గ్రీవెన్స్‌కు అప్పగించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.

News April 2, 2024

మదనపల్లెలో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ

image

మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం ముగిసింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైన మాట్లాడారు. అనంతరం వైసీపీ అభ్యర్థులను స్టేజీపైన ప్రకటించి వారిని గెలిపించాలని కోరారు. ఆయన సభ ముగిసిన తర్వాత నిమ్మనపల్లె క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. అమ్మగారిపల్లెలో రాత్రి బసచేయనున్నారు.

News April 2, 2024

విశాఖ: విద్యార్థిని మృతి కేసులో ఐదుగురు అరెస్టు

image

కొమ్మాదిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 28న విద్యార్థిని మృతి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించినట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్.శంకర్రావు, మేనేజ్మెంట్ సిబ్బంది శంకర్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ జి.భాను ప్రకాష్, హాస్టల్ వార్డెన్ వి.ఉషారాణి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.

News April 2, 2024

మదనపల్లెను హైటెక్ సిటీ చేశారా: సీఎం జగన్

image

మదనపల్లెలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మిస్తానని అన్నారని, మదనపల్లెలో నిర్మించాడా అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో పశుపతి లాగా.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 2, 2024

BIG BREAKING: కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇటు పాణ్యం అటు బనగానపల్లె నియోజకవర్గాల్లో కాటసాని బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

News April 2, 2024

తిరుపతి: పీజీ ఫలితాలు విడుదల

image

SV యూనివర్సిటీ పరిధిలో గత
ఏడాది సెప్టెంబర్ నెలలో PG మొదటి సంవత్సరం ఏంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ అంత్రోపాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్‌లో చూడాలన్నారు.

News April 2, 2024

కడప ఎంపీ అభ్యర్థులు వీరే

image

కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కడప పార్లమెంటు నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు.