Andhra Pradesh

News April 2, 2024

ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో భాగంగా రిజర్వ్‌డు స్థానాలైన బద్వేలు నుంచి విజయ జ్యోతి, రైల్వే కోడూరు నుంచి గోసుల దేవితో పాటు రాయచోటి నుంచి అల్లా బకాష్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది.

News April 2, 2024

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.

News April 2, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * తంబళ్లపల్లి- చంద్రశేఖర్ రెడ్డి * పీలేరు- సోమశేఖర్ రెడ్డి * మదనపల్లె-పవర్ కుమార్ రెడ్డి * పుంగనూరు- మురళీమోహన్ యాదవ్ * చంద్రగిరి- కనుపర్తి శ్రీనివాసులు * శ్రీకాళహస్తి- రాజేశ్ నాయుడు * సత్యవేడు (SC) – బాలగురువం బాబు * నగరి- పి రాకేశ్ రెడ్డి * చిత్తూరు- తికరామ్ * పలమనేరు- శివశంకర్ *
కుప్పం- ఆవుల గోవిందరాజులు

News April 2, 2024

ఏర్పేడు : మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఏదేని డిగ్రీ, అడ్మినిస్ట్రేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 07.

News April 2, 2024

కృష్ణా : ఆ స్థానాలకు ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు

image

ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 16 MLA స్థానాలకు గాను 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

News April 2, 2024

ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * ఆత్మకూరు: చేవురు శ్రీధర్ రెడ్డి * కోవూరు: నెబ్రంబాక మోహన్ * నెల్లూరు రూరల్ షేక్ ఫయాజ్ * సర్వేపల్లి- పూల చంద్రశేఖర్ * గూడూరు (SC)- వేమయ్య చిల్లకూరి * సూళ్లూరుపేట (SC)- గడి తిలక్ బాబు * ఉదయగిరి- సోము అనిల్ కుమార్ రెడ్డి

News April 2, 2024

కర్నూలు: కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ సామాజికవర్గాలైన కోడుమూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ, నందికొట్కూర్ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే తోగూర్ అర్థర్‌ను ప్రకటించింది. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పీజీ రాంపుల్లయ్య పోటీ చేయనున్నారు.

News April 2, 2024

VZM: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి తొలి విడతలో ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. విజయనగరం, అరకు ఎంపీ అభ్యర్థులతో పాటు మరో నాలుగు నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
✒ పార్వతీపురం- బత్తిన మోహన్ రావు  
✒ సాలూరు- మువ్వల పుష్పారావు  
✒ చీపురుపల్లి- తుమ్మగంటి సూరినాయుడు  
✒ గజపతినగరం- గడపు కూర్మినాయుడు  
✒ విజయనగరం- సుంకరి సతీష్ కుమార్‌

News April 2, 2024

ప.గో. జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

image

కొవ్వూరు – అరిగెల అరుణకుమారి, నిడదవోలు- పెద్దిరెడ్డి సుబ్బారావు, పాలకొల్లు- కొలుకులూరి అర్జునరావు, నరసాపురం- కనురి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్, భీమవరం- అంకెం సీతారాం, ఉండి- వేగేశ్న వెంకట గోపాలకృష్ణ, తణుకు- కడలి రామరావు, తాడేపల్లిగూడెం- మర్నీడి శేఖర్, ఉంగుటూరు- పాతపాటి హరికుమార రాజు, దెందులూరు- అలపాటి నరసింహ మూర్తి, పోలవరం- దువ్వెల సృజన, చింతలపూడి- ఉన్నమట్ల ఎలీజా.

News April 2, 2024

రెండుకు చేరిన పుంగనూరు రోడ్డు ప్రమాద మృతులు

image

పుంగనూరు మండలం,ఈడిగపల్లి వద్ద సోమవారం రాత్రి ఆటో ఢీకొని బైకు నడుపుతున్న మదనపల్లె అరవాండ్లపల్లి పూల లక్ష్మి నరసింహ(36) అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం పాఠకులకు తెలిసిందే. కాగా చికిత్స పొందు తున్న ఇద్దరిలో మంగళవారం సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లికి చెందిన రమణ(45) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పుంగనూరు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరింది.