Andhra Pradesh

News March 31, 2024

రాజమండ్రి: ‘ఈసీ ఆంక్షలు చంద్రబాబు చేసిన కుట్రే’

image

జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన యువత వాలంటీర్లుగా పనిచేస్తుంటే టీడీపీ- జనసేన నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించడం చంద్రబాబు చేసిన కుట్రే అన్నారు.
– ఎంపీ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

News March 31, 2024

పార్వతీపురం: ‘సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం’

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. EVM గోడౌన్‌ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో EVM, వీవీ ప్యాట్‌లపై శిక్షణ అందించనున్నామని అన్నారు.

News March 31, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలి’

image

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ సూచించారు. జిల్లాలోని వివిధ నోడల్ అధికారులతో శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా నోడల్ అధికారుల సమక్షంలో చేయాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని డీఆర్ఓ సూచించారు.

News March 31, 2024

అనకాపల్లి: ‘వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తాం’

image

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన సౌకర్యాలను వృద్ధులు దివ్యాంగులకు కల్పిస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పేర్కొన్నారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కల్పించే సౌకర్యాలను వారు వినియోగించుకోవాలని కోరారు. 85 ఏళ్లు నిండిన వృద్ధులకు పోలింగ్ బూత్‌కి రాలేని దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు.

News March 30, 2024

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తులు ఆహ్వానం

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నట్లు సివిల్ విభాగాధిపతి బి.అజిత ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఎంటెక్ లేదా ఎంఈ చేసిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు www.uconpt.com వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించారు.

News March 30, 2024

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పొడగింపు: డీఈఓ

image

కర్నూలు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 30, 2024

భీమిలిలో రోడ్డు ప్రమాదం వివాహిత మృతి

image

మండలంలోని సంగివలస మూడు అమ్మవార్ల గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. అనకాపల్లికి చెందిన చంద్రతేజాదేవి (24)కి భీమిలి మండలానికి చెందిన గంగడ పైడిరాజుకి గత నెలలో వివాహం అయింది. వీరు మద్దిలపాలెంలో నివాసముంటున్నారు. ఈరోజు సింగనబంద అమ్మవారిని దర్శించుకుని బైక్‌‌పై తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భీమిలి సీఐ డీ.రమేశ్ తెలిపారు.

News March 30, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

image

తిరుమల మొదటి ఘట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏనుగులు అర్చ్ దాటిన తర్వాత ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలకు గాయాలు కాగా.. అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఈవో ధర్మారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.

News March 30, 2024

ఏలూరు: కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) శనివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

శ్రీశైలానికి పాదయాత్రగా వస్తూ కన్నడ భక్తుడి మృతి

image

మంత్రాలయం మండలం చిలకలడోన – బూదూరు గ్రామాల మధ్య కర్ణాటక రాష్ట్రం బెలగాం ప్రాంతానికి చెందిన బసప్ప(22) మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు. ప్రతి ఏడాది లాగే బసప్ప, వారి కుటుంబ సభ్యులు ఈనెల 24న పాదయాత్రగా సొంత గ్రామం నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. మార్గమధ్యలో హఠాత్తుగా మృతిచెండంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు.