India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురానికి నీళ్లు, నియామకాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే సంపద సృష్టిస్తూ.. సంక్షేమాన్ని ఇస్తానని తెలిపారు. ‘సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. గంజాయి తెచ్చే ముఖ్యమంత్రి కావాలా’ అని ప్రజలను అడిగారు.

ప్రొద్దుటూరు నడిబొడ్డులోని శివాలయం సెంటర్లో చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించిన ప్రజా గళం సభ చరిత్రలో ఇంతటి ఘోరమైన సభను చూడలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. సభకు డబ్బులు ఇచ్చి పిలిపించినా 5000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన ఒక్క అభివృద్ధిని చెప్పలేదని విమర్శించారు.

మద్దికేర మండల కేంద్రంలోని కోతులుమాను దగ్గర టాటా ఏసీ టైర్ పగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని కర్నూలుకు తరలించారు. రోజు వారిగా చిప్పగిరి మండలానికి మిరప పంట కోతకు వెళ్లేవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సీ-విజిల్ యాప్‌లో ఇప్పటివరకు అందిన 181 ఫిర్యాదులలో 95 ఫిర్యాదులను పరిష్కరించామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మరో 86 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు రాగా వాటిని తిరస్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా రూ.81.76 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. జిల్లాలో నిరంతరంగా సర్వేలైన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ఓ పర్యాటకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు కావడంతో తూగో జిల్లా రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వచ్చారు. వారిలో కొండయ్య(33) అనే పర్యాటకుడు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడ్డాడు. స్నేహితులు హుటాహుటీన మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం పులివెందులలోని జెండా మాను వీధిలో తన భార్యను హత్య చేసిన కేసులో అనుమానితుడిగా కానిస్టేబుల్ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికుల సమాచారం ద్వారా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Sorry, no posts matched your criteria.