Andhra Pradesh

News March 28, 2024

కన్వర్జెన్సీ పనులపై దృష్టి సారించండి: కలెక్టర్

image

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్సీ పనులుపై పీఓ, ఎపీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
ఎన్ఆర్‌ఈజీఎస్‌పై సిబ్బందితో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. వేతనాలు అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.

News March 28, 2024

రాప్తాడు: రాయలసీమ ద్రోహి జగన్: చంద్రబాబు

image

రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను సీమకు నీళ్లు తెస్తే.. సీఎం జగన్ రాజకీయ హింస తెచ్చాడు అని విమర్శించారు.

News March 28, 2024

పోతిన మహేశ్ దారెటు..?

image

జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పోతిన మహేశ్ వెనక్కి తగ్గడం లేదు. న్యాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుజ్జగించినా వినే పరిస్థితి కనపడంలేదు. పార్టీ గీత దాటితే సహించేది లేదని ఇప్పటికే పవన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి మహేశ్ ఏమి చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మహేశ్ సర్దుకుంటారా.. మరేదైనా నిర్ణయం తీసుకుంటారా వేచి చూడాలి.    

News March 28, 2024

కడప టీడీపీ MP అభ్యర్థిగా వారిలో ఎవరు .?

image

రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప MP అభ్యర్థిగా ఎవర్ని నియమించాలని అధిష్ఠానం మల్లగుళ్ళాలు పడుతుంది. రోజుకో కొత్త పేరుతో ఆసక్తి రేపుతోంది. వీరశివారెడ్డి, భూపేశ్‌రెడ్డి, రితీశ్‌రెడ్డి, ఉక్కు ప్రవీణ్, వాసు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు ఐవీఆర్ సర్వే ద్వారా వీరి పేర్లతో ఫోన్లు చేస్తుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

News March 28, 2024

HM.పాడు: కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి

image

హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురంలో గురువారం కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి చెందాయి. సీతారాంపురం గ్రామానికి చెందిన తెల్లయ్య, గురవయ్యకి సంబంధించిన గొర్రె పిల్లలను దొడ్లో కట్టేశాడు. కుక్కల మంద వచ్చి దాడి చేయడంతో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయని వారు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 28, 2024

గ్రూపులో ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత: గుంటూరు ఎస్పీ

image

సోషల్ మీడియాలో ఎన్నికల వేళ చేసే ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత అని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. వివాదాస్పద పోస్టులు, కామెంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుంచి తొలగించాలని, అలాంటి పోస్టుల వివరాలు పోలీసులకు సమాచార ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

News March 28, 2024

ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈఓ

image

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆయా స్కూళ్లలో 25 శాతం కోటా కింద పేద విద్యార్థులు ప్రవేశం పొందచవ్చని తెలిపారు. విద్యార్థుల https://cse.ap.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 

News March 28, 2024

ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి సుజనా చౌదరి

image

విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థి సుజనా చౌదరి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. 2005లో టీడీపీలో చేరిన ఆయన 2010 నుంచి రెండు విడతలు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు. సుజనా చౌదరి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల.

News March 28, 2024

అనపర్తి MLA సీటుపై కూటమి అభ్యర్థి కీలక వాఖ్యలు

image

కూటమి అభ్యర్థి శివకృష్ణం రాజు టికెట్ వివాదంపై స్పందించారు. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా అందరూ కలసి సహకరించుకుని ఎన్నికల్లో పోటీ చేయడం పొత్తు ధర్మం అన్నారు. త్వరలో నల్లమిల్లి రామక్రిష్ణ రెడ్డితో పాటు జనసేన నేతలను కలసి మద్ధతు అడుగుతానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానన్నారు.

News March 28, 2024

సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన సాయినాథ్ శర్మ

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీబొట్ల సాయినాథ్ శర్మ గురువారం నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైసీపీ నేత వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.