India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గడ్డి మందు తాగి వెంకటసాయి (17) మృతి చెందిన ఘటన తుళ్ళూరు (M) మోదుగలంకపాలెంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో మృతుడు ప్రేమలో ఉన్నాడు. విషయం యువతి బంధువులకు తెలియడంతో యువకుడి ఇంటికి వచ్చి బెదిరించారు. భయంతో యువకుడు గురువారం గడ్డి మందు తాగగా, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జమ్మలమడుగు మండలం, గొరిగేనూరులో తడి బట్టతో ఇంట్లో బండలు తుడుస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైన రామసుబ్బమ్మ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఇంట్లో గత కొన్నేళ్లుగా ఇంటి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో తడిబట్టలతో బండలు తుడుస్తూ మరో చేత స్విచ్ బోర్డు పట్టుకున్నది. విద్యుత్ సరఫరా అవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పొట్టకూటి కోసం క్లీనర్ పని చేసుకోవడానికి లారీ వెంట వచ్చిన కార్మికుడు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కొలిమిగుండ్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా బూడిదపాడు గ్రామానికి చెందిన గురక రామిరెడ్డి(48) ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు PC నరసింహులు తెలిపారు.

ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బి.కొత్తకోట కాండ్లమడుగు క్రాస్, ఈడిగపల్లికి చెందిన నవీన్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్ ఓ అమ్మాయిని ప్రేమించగా.. నిరాకరించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు బాధితుణ్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.

ఉదయగిరి పట్టణంలోని సికిందర్ పిక్చర్ ప్యాలెస్ ఎదుట సినీ వీక్షకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. డీజే టిల్లు- 2 చిత్రం చూసేందుకు వచ్చిన వీక్షకులకు అసౌకర్యానికి గురై నిర్వాహకులతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్రం ప్రసార సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వీక్షకులు ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా టికెట్ ఇచ్చి తిరిగి డబ్బులు తీసుకుని వెనుతిరిగారు.

కేంద్రీయ విద్యాలయం (బాబామెట్ట)లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15న సాయంత్రం వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 32 సీట్లకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిది రిజర్వు చేసినట్లు తెలిపారు. రెండు, ఆపై తరగతులకు ఖాళీల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

కుటుంబ కలహాల కారణంగా గన్నేరు పప్పు తిని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనబంగారుపాలెం మండలం వెంకటాపురంలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. వెంకటాపురానికి చెందిన రఘు (50) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది గన్నేరు పప్పు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో రూ. 2,44,000, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సరియైన అర్ధాలు చూపకపోవటంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,29,74,584 నగదును స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో మగ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఎలుగుబంటి అడవి నుంచి కొద్ది నెలల కిందట శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులోని జనారణ్యంలోకి చేరి అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. దీన్ని అటవీశాఖ అధికారులు బంధించి విశాఖ జూకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూ అధికారులు ఈ ఎలుగుబంటిని ఏఆర్‌సీలో సంరక్షిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా శనివారం వేకువజామున మరణించింది.
Sorry, no posts matched your criteria.