India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇటీవల శొంట్యాంలో పెళ్లి కారు <<12894599>>బోల్తా పడిన విషయం<<>> తెలిసిందే ఈ ఘటనలో గాయాలైన ఓ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆనందపురం ఎస్సై శివ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు చిన్నారులలో తీవ్రంగా గాయపడిన కౌశిక్ (4) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పూర్తి సమాచారం కోసం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కోవూరులో వరుస విజయాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1993లో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99 ఎన్నికల్లోనూ విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గంలో కొనసాగుతూ 9వ సారి పోటీ చేయబోతున్నారు.

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 1953లో ప్రాతినిధ్యం వహించి చట్టసభలకు వెళ్లారు. 1953లో సీవీ సోమయాజులు అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎస్పీ నుంచి టంగుటూరి ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 1952 నుంచి 2019 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం ఎంపీగా కె.రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ఈసారి కూడా కూటమి కె.రామ్మోహన్ నాయుడుకే టికెట్ కేటాయించింది. అటు వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ను జగన్ బరిలో దింపారు. వైసీపీని ఓడించి కె.రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొడతారా..? కామెంట్ చేయండి.

తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట సమీపంలోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై దొర తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బుద్ధన పవన్ కుమార్ (19) పెంపుడు కుక్క, స్నేహితుడితో కలిసి ఏలేరు కాలువ గట్టు వైపు వెళ్తుండగా కుక్క పరిగెత్తడంతో దాన్ని పట్టుకునే క్రమంలో నీటిలో పడిపోయాడు. స్థానికులు నీటిలో దూకి బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు.

టికెట్ రాకపోవడంతో తిక్కారెడ్డి, ఆయన అనుచరులు TDP అధిష్ఠానంపై మండిపడుతున్నారు. తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పనిచేసేలా చేయకపోతే గెలుపు కష్టమేనని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెనాలి లలితానగర్‌లో భార్యాభర్తలు రవికాంత్, స్వాతి నివాసం ఉంటున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య కృష్ణా జిల్లా గంపలగూడెం మం. ఉటూకూరులో అత్తగారి ఇంటికి వెళ్లి చెప్పింది. ఆ తర్వాత కొడుకు(5)ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తన సోదరి ఆనారోగ్యం కారణంగా స్వాతి విజయవాడకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రవికాంత్ అక్కడికి వచ్చి కుమారుడిని తీసుకొని పారిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్‌పై కేసు నమోదైంది. కావలి మండలం ఆముదాల వలస వాలంటీర్ తాత ప్రవీణ్ ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎన్నికల నియమావళి నోడల్ అధికారి వెంకటేశ్వర్లు దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టిన ఆయన వాలంటీర్‌పై కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శనివారం విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సాగర్ నగర్‌లోని నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5గంటలకు నోవాటెల్ హోటల్‌కి వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. 24న తిరుగు ప్రయాణం కానున్నారు.
Sorry, no posts matched your criteria.