India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పొన్నూరు మండలం మాచవరం గ్రామం తుంగభద్ర డ్రెయిన్ కట్టపై గురువారం పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై బండ్ల భార్గవ్ ఆధ్వర్యంలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, 6 కోడిపుంజులతో పాటు 16 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినా.. గెలిచిన దాఖలాలు లేవు. 1983లో కాంగ్రెస్ నుంచి M.లక్ష్మీకాంతమ్మ పోటీ చేయగా..TDP అభ్యర్థి S.ప్రకాశం చేతిలో ఓడిపోయారు. 2009లో V.సరస్వతి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా..TDP అభ్యర్థి పరసా వెంకటరత్నం చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 ఎన్నికల్లో TDP తరఫున నెలవల విజయశ్రీ.. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. విజయశ్రీ గెలిచి రికార్డు సృష్టిస్తారా?

ప్రేమ విఫలమై మహేష్ (19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, బి.ఎర్రగుడి గ్రామం, కాపుపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు హుటాహుటిన లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటి రోజుల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారింది. అలాంటిది ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కె.ప్రతిభా భారతి టీడీపీ తరఫున 1983 నుంచి 2004 వరకు పోటీ చేసి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించింది. పోటీ చేసిన ప్రతిసారి 10 వేలకుపైగానే మెజార్టీతో గెలుపొందారు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి మహిళ స్పీకర్ గా పనిచేశారు.

తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం MP చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే పని చేస్తాను తప్ప మరో గూటికి చేరే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు.

సి.విజల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులు కోడ్ ఉల్లంఘన సంబంధించి చర్యలు గుర్తించిన వెంటనే సి.విజల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించాలనిక సిబ్బందికి సూచించారు.

పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్నట్లు గుర్తించి.. సాలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు మేరకు వారిని విధుల నుంచి తొలగించామన్నారు.

ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దర్శనానికి వస్తారని జిల్లా టీడీపీ నాయకులు తెలిపారు. రేపు హైదరాబాదు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో 1:00 కు బయలుదేరి రాపూరు(మం) గోనుపల్లిలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 3.15 వస్తానన్నారు. అక్కడనుంచి కారులో స్వామివారిని దర్శించుకుంటారు. తిరిగి ఉండవల్లికి వెళ్తారన్నారు.

తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. మరుసటి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
Sorry, no posts matched your criteria.