Andhra Pradesh

News March 19, 2024

నందిగామ: ఘనంగా నూతన కోర్టు భవనాలు ప్రారంభం

image

నందిగామలోని కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శేష సాయి, హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, గోపాలకృష్ణ మండేల పాల్గొని ప్రారంభించారు.

News March 19, 2024

శ్రీకాకుళం: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ టెన్త్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం 79 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 68 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 11 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 19, 2024

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

నెలవారీ నేర సమీక్షా సమావేశం నెల్లూరులోనే ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్థి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జీరో-వయోలెన్స్, జీరో-రీపోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణే ధ్యేయమన్నారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News March 19, 2024

రొళ్ల మండలంలో యువతి మృతి

image

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

‘బండారుకే పెందుర్తి టికెట్ ఇవ్వాలి’

image

పెందుర్తి టికెట్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బండారుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెన్నెలపాలెం నుంచి పరవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. బండారు టికెట్ ఇవ్వని పక్షంలో జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా చేసిన ఒక సీనియర్ నేతకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం సమంజసం కాదన్నారు.

News March 19, 2024

అనకాపల్లి: భవనం మీద నుంచి పడి మృతి   

image

కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇసరపు రామకృష్ణ (25) కోటవురట్లలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

News March 19, 2024

గుంటూరు రైల్వే‌స్టేషన్లో వ్యక్తి మృతి

image

గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు. 

News March 19, 2024

కృష్ణా: APSDMA అధికారుల ముఖ్య విజ్ఞప్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.