Andhra Pradesh

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తున్నాయి. జిల్లాలోని పొందూరు, చిలకపాలెం, గంగువారి సిగడాం, ఆమదాలవలస పలు మండలాల్లో ఈదురు గాలులు ఉరుములతో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.

News March 19, 2024

కడప జిల్లాలో నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆవేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 20న గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామంలో పర్యటించి తిరుమల వెళ్లనున్నారు. 21న రాత్రికి బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పొరుమామిళ్ల చేరుకుని మండలంలో 22న కార్యకర్తలను పరామర్శిస్తారు.

News March 19, 2024

సూళ్లూరుపేటలో టపాసుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

image

సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఉన్న టపాసుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ?

image

అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధ పోటీ చేస్తారన్న ప్రచారం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించగా, అక్కడ బొండా ఉమాకు అవకాశం దక్కింది. దీంతో జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి నాదెండ్ల మనోహర్‌ని రాధ కలవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

News March 19, 2024

బాపట్ల: రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలివే!

image

బాపట్లలో సోమవారం సాయంత్రం <<12879418>>రైలు కిందపడి<<>> మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 19, 2024

విశాఖలో కొత్త తరహా చోరీ

image

సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీహరిపురం ఏటీఎం కేంద్రంలో కార్డు వినియోగించే చోట ఓ ముఠా కొద్దిపాటి మార్పులు చేసి నలుగురి నుంచి రూ. లక్ష కాజేసింది. నగదు డ్రా చేసేందుకు వచ్చినవారు కార్డు పెట్టగా అది లోపలికి పోతోంది. వెంటనే ముఠాలో ఒకడు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ముఠా అతికించిన నంబర్‌కి ఫోన్ చేయాలని సలహా ఇస్తాడు. నంబర్‌కి ఫోన్ చేయగా ముఠాలో మరొక సభ్యుడు వివరాలు సేకరించి వేరే ATMలో నగదు డ్రా చేస్తాడు.

News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో మహిళ మృతదేహం లభ్యం

image

ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దాములూరు గ్రామం డొంక రోడ్డులో సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు గలిగిన మహిళ మృతదేహం ఉందని, స్థానికులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

అనంత: ఫోన్ హ్యాక్ చేసి రూ.1,73,100లు చోరీ

image

గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన షేక్ జిలాన్ బాషాకు అనంతపురంలో యాక్సెస్ బ్యాంకు అకౌంట్ ఉంది. శనివారం రాత్రి ఖాతా నుంచి రూ.1,73,100 దొంగలించినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై సైబర్ క్రైమ్ నంబర్ 1030తోపాటు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ లింకు పంపించి క్లిక్ చేయగానే ఫోను హ్యాక్ చేసి దొంగలించినట్లు పేర్కొన్నారు.

News March 19, 2024

‘ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ సముద్ర ఖని’

image

శ్రీశైలానికి 20 కి.మీ దూరం గల దట్టమైన అభయారణ్యంలో వెలసిన కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సినీ దర్శకులు సముద్ర ఖని మంగళవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన ముందుగా నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అనంతరం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట స్థానికుడు కోటి ఉన్నారు.

News March 19, 2024

జలదంకి: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

image

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.