India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన చూపిన గుంతకల్లుకు చెందిన బి.అమూల్య రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె.. ఈనెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొననుంది. విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అమూల్యను పలువురు అభినందించారు.
జీవీఎంసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికే విధులకు హాజరుకావాలని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ఆదేశించారు. శనివారం విశాఖలో అన్ని జోన్ల సిబ్బందితో సమావేశమై ఉదయం9:30 నుంచి సా.5:30 వరకు వీధులు నిర్వహించాలని సూచించారు. చాలాచోట్ల మధ్యాహ్నం విధులకు హాజరు కావడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ పూర్తి చేసి పంపించాలని, పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
VIPలను గర్భగుడిలో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ కాలం ఉండకుండా త్వరగా పంపడం వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడవచ్చని కలెక్టర్ రామ సుందర రెడ్డి అభిప్రాయపడ్డారు. పైడిమాంబ ఉత్సవ ఏర్పాట్లుపై జరిగిన సమావేశంలో పలు సూచనలు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, చెత్తను వెంట వెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమీషనర్‌కు సూచించారు. గుంతలు పూడ్చాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లా ప్రజలు కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. కలెక్టరేట్లో మాట్లాడిన ఆయన అర్జీలు సమర్పించిన ప్రజలకు సమస్య పరిష్కారం కాకపోతే 1100 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పత్తికొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.మాధురి, నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
కోటబొమ్మాళిలో వెలసి ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అన్నారు.
ప్రకాశం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ SE వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను జిల్లా వ్యాప్తంగా చెల్లించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న విద్యుత్ బిల్లుల కౌంటర్లను వినియోగదారులు సంప్రదించి విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులోని ఆదిత్య కాలనీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ‘మీకోసం కార్యక్రమం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు Meekosam.ap.gov.in లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.