India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ప్రకటిస్తూ బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కాసేపటి క్రితం దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఈయన రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు రాజకీయాల్లో సంచలనంగా మారారు. కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు బీజేపీ గూటికి చేరారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. సాయంత్రానికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. గతంలోనూ ఆయన తిరుపతి ఎంపీగా వ్యవహరించారు.

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.

బీజేపీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గూడూరు MLA వర ప్రసాద్‌కి.. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ CM నల్లరి కిరణ్‌కుమార్ రెడ్డికి సీటు కేటాయించింది. తిరుపతి YCP అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, రాజంపేట అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా అరణి శ్రీనివాసులుకి సీటు కేటాయించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలకు TDP చీఫ్ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆలూరు అసెంబ్లీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ నియోజకవర్గ నేతలు, ప్రజల్లో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, వచ్చే జాబితాలో ఆ సీటు కేటాయింపుపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు తండాలో మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటించారు. లంబాడి మహిళల సంప్రదాయ దుస్తులతో ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం మద్దెలచెరువు తండాకు చెందిన మహిళలు సునీతకు తమ సంప్రదాయ దుస్తులు అందజేసి కాసేపు పాటలు పాడారు.

ఉమ్మడి విశాఖలోని మరో 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అనకాపల్లి సీటు కొణతాల రామకృష్ణకు ఇవ్వగా.. పెందుర్తి పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ పోటీలో ఉండనున్నారు. అటు విశాఖ వెస్ట్ వంశీ కృష్ణ యాదవ్‌కు ఇస్తారని వార్తలొచ్చినప్పటికీ ఈ జాబితాలో అతని పేరు లేదు. ఉమ్మడి విశాఖలో విశాఖ నార్త్, సౌత్, పాడేరు, భీమిలిలో కూటమి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాజంపేట అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయం కోసం మూడు పార్టీల నేతలు పనిచేయాలన్నారు.

విశాఖ నగరం రామ టాకీస్ సమీపంలో ట్రావెల్ కార్యాలయంలో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివాజీపాలెంకు చెందిన వి.శివనాగరాజు వీటిని దాచి ఉంచడంతో అతనిని అరెస్టు చేశామన్నారు. వీటిని వదిలి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.

విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసే NDA కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్‌కు ఇవ్వాలని JSP క్యాడర్ బలంగా కోరుతుండగా, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంలో మహేష్ అనుచరులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని జనసేన అధిష్ఠానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.