India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల్లో సంతృప్తి చెందేలా ప్రాధాన్యత క్రమంలో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత నగరంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఆరా తీశారు. మొదటి దశలో చేపట్టిన 15 రహదారుల విస్తరణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.
గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన 2 రోజుల్లో 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. ఈగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై కార్డెన్ సెర్చ్, వాహనాల తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.
తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్‌డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.
తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణపై MLAగంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షించారు. గ్రామంలో సబ్‌రిజిస్ట్రార్ ధర ఎకరానికి రూ.17లక్షలు ఉందని, D.పట్టా భూములకు ఎకరానికి రెండున్నర రెట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. 520మంది రైతులకు వారి భూముల స్వరూపాన్ని బట్టి పరిహారం అందిస్తామన్నారు. గూగుల్ డేటా సెంటర్‌లో రైతుల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు.
విద్యుత్తు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ అన్నారు. విశాఖ సాగర్ నగర్‌లోని ట్రైనింగ్ సెంటర్లో విశాఖ ఐఐఎం సహకారంతో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. వినియోగదారులకు మరింత చేరువకావడానికి ఉపయోగపడతాయన్నారు. శిక్షణ పూర్తి చేసిన అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.
నెల్లూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి వీరి చలపతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేయడంతో జిల్లాలోని వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. జిల్లాలోని వైసీపీ కీలక నేతల్లో అయన ఒకరు. ఈ నేపథ్యంలో అయన అరెస్టయ్యారు. ఇప్పటికే విడవలూరు, కొడవలూరు నుంచి అయన అనుచరులు నెల్లూరుకు చేరుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జిల్లాలో చర్చ జరుగుతోంది.
✒︎ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్
✒︎ శ్రీకాకుళం: దొంగల నుంచి రూ.58 లక్షలు స్వాధీనం
✒︎ పర్యావరణంపై ప్రతీఒక్కరు దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
✒︎ ఇచ్ఛాపురం: కేసుపురంలో ఆకస్మాతుగా కూలిన ఇంటి గోడ
✒︎ పొందూరు: భవనంపై నుండి జారిపడిన విద్యార్థిని
✒︎ అధ్వానంగా కింతలి-శ్రీకాకుళం రహదారి
✒︎ నరసన్నపేట: నదిలో హెచ్ఎం గల్లంతు.. మృతదేహం లభ్యం
విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగల రద్దీ కారణంగా రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్‌లో మంచినీటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా విక్రయించేందుకు ఆసక్తిగల వ్యాపారుల నుంచి లైసెన్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు DRO ఓబులేసు తెలిపారు. ఒంగోలులోని డీఆర్వో కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈనెల 21 నుంచి వచ్చేనెల ఐదులోగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీపావళి బాణసంచాను అక్రమంగా తయారు చేయడం, నిల్వ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
వైసీపీ కీలక నేత, DCMS మాజీ ఛైర్మన్ వీరి చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి తరలించారు. అయితే ఏ కేసులో అరెస్టు చేశారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.
Sorry, no posts matched your criteria.