Andhra Pradesh

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.

News November 28, 2025

చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

image

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.

News November 28, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్‌కు 21 వినతులు

image

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News November 28, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో నిన్నటికి, ఈరోజుకు తేడా లేదు. వెండి స్వల్పంగా రూ.30లు పెరిగింది. ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము: రూ.12,590
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము: రూ.11,583
☛ వెండి 10 గ్రాములు: రూ.1680

News November 28, 2025

అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

image

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్‌ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News November 28, 2025

శ్రీకాకుళం జిల్లా రైతులకు తీపి కబురు: మంత్రి అచ్చెన్నాయుడు

image

శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వంశధార రిజర్వాయర్లో మరో 12 టీఎంసీలు నీరు నింపేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం పనులు చేపట్టినా నిధులు విడుదల చేయలేదన్నారు.

News November 28, 2025

ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

image

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్‌ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్‌ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

News November 28, 2025

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

image

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్ర‌హానికి కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.

News November 28, 2025

రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.