Andhra Pradesh

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 30, 2025

ప.గో: రేపు పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం.!

image

ప.గో జిల్లాలో 2,25,132 మంది లబ్ధిదారులకు రూ.97.29 కోట్ల సామాజిక పెన్షన్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సోమవారం ఉదయం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సచివాలయం సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సకాలంలో పంపిణీ చేస్తారన్నారు.

News November 30, 2025

తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

image

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

News November 30, 2025

నెల్లూరులో మెడికో విద్యార్థి సూసైడ్ !

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 30, 2025

కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.

News November 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లాకు RED ALERT.!

image

ప్రకాశం జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి భారీ వృక్షాల వద్ద, పాత భవనాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలని వారు సూచించారు. నెల్లూరు జిల్లాలో కూడా RED ALERT ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 30, 2025

కర్నూలు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

వెల్దుర్తి మండలం కలుగోట్లలో వ్యవసాయ అప్పులు, పంట నష్టంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బోయ మద్దయ్య(55) ఆదివారం వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తనకు ఉన్న 2 ఎకరాలతో పాటు దేవుని మన్యం కౌలుకు తీసుకొని సాగు చేశారు. పంట నష్టం వాటిల్లి రూ.6 లక్షలు అప్పులు మిగిలాయి. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య లక్ష్మీదేవి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 30, 2025

చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

image

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News November 30, 2025

కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

image

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

News November 30, 2025

కడప: తుఫాన్ ఎఫెక్ట్.. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ

image

జిల్లాలో తుపాన్ దృష్ట్యా ప్రమాదాలపై కడప జిల్లాలో 5 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ SE రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప జిల్లా కార్యాలయం: 9440817440
కడప డివిజన్: 9440817441
పులివెందుల డివిజన్: 9491431255
ప్రొద్దుటూరు డివిజన్: 7893261958
మైదుకూరు డివిజన్: 9492873325లను సంప్రదించాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.