India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలాస రైల్వే స్టేషన్‌లో సంరక్షకులు లేకుండా ఒంటరిగా తిరుగుతున్న ఓ చిన్నారి కనిపించింది. ప్రయాణికులు 139 నంబర్‌కు సమాచారం ఇవ్వగా, జీఆర్పీ సిబ్బంది అబ్బాయిని శిశుగృహనికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ నుంచి ఒంటరిగా దిగిన బాలుడికి మూడేళ్లు ఉంటాయని వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళంలోని ఉమన్ ఛైల్డ్ డిపార్ట్ మెంట్‌కు తెలపాలని జీఆర్పీ ఎస్సై శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ బదిలీ అయ్యారు. నూతన JC గా మొగిలి వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ విజయనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు.
మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల కోసం కూడా వుడా పార్కులో స్టేట్ బోర్డు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అడివివరం- శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ పనులను పరిశీలించారు.
ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పాలకొల్లులో సిద్ధం చేస్తున్న హెలిపాడ్, కళ్యాణ వేదిక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నందున, బ్రాడీపేట బైపాస్ రోడ్డులో హెలిపాడ్‌ను పరిశీలించి, పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అన్నారు.
తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామంలో పశువుల వ్యాధి నియంత్రణకు గ్రామస్థాయి జాగ్రత్తలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామంలో పశువులకు థైలీరియాసిస్ & అంపిస్టోమియాసిస్ పూర్వస్థాయి కేసులు గుర్తించబడ్డాయన్నారు. వ్యాధి సోకిన పశువులకు తక్షణ చికిత్స, నిరోధక ప్రోటోకాల్ అమలు చేస్తున్నామన్నారు. మిగతా పశువులకు నివారణ మందులు అందిస్తున్నట్లు చెప్పారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులోని ఆదిత్య కాలనీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ నవ్య శనివారం తెలిపారు. సోమవారం నుంచి రూ.1,200 మద్దతు ధర అమలులో ఉండదని, రైతులు కళ్లాల్లో కానీ, లోకల్ ట్రేడర్స్ దగ్గర కానీ, ఇతర మార్కెట్లలో కానీ తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని అన్నారు.
కలరా వంటి జలమూల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జీవనరాణి శనివారం సూచించారు. విరేచనాలు, వాంతులు, శరీర నిస్సత్తువ, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు గమనించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని, కాబట్టి మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వాసు దేవరావు హెచ్చరించారు. ప్రభుత్వం నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. 22నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.