Andhra Pradesh

News September 20, 2025

పొందూరు: భవనంపై నుంచి జారిపడిన విద్యార్థిని

image

పాఠశాల భవనంపై నుంచి జారిపడి ఓ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పొందూరు(M) లోలుగులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడింది. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను నైట్ డ్యూటీ సిబ్బంది హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 20, 2025

నెల్లూరు: కూలితే ప్రమాదమే..!

image

జాతీయ రహదారి నుంచి కోవూరు మండలం ఇనమడుగు సెంటర్‌కు వెళ్లే రహదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగించకుండా ఏర్పాటు చేసిన భారీకేడ్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఓ వైపు కింది భాగం ఊడిపోయి పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో ఆ భారీకేడ్ పడిపోయి ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం వాహనాల రాకపోకల్లో భారీకేడ్ పడిపోతే పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 20, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన SP తుషార్

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తుషార్ డూడీ కలెక్టర్ సుమిత్ కుమార్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల సమర్థవంతమైన అమలు వంటి కీలక అంశాలపై చర్చించుకున్నారు.

News September 20, 2025

శ్రీకాకుళాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యమవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు . మండలంలోని గనగలవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు.

News September 20, 2025

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు MP

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు శనివారం కోరారు. చిన్నపిల్లలను వాగులు, వంకల వద్దకు వెళ్లనివ్వరాదని సూచించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

News September 20, 2025

వృద్దురాలిపై దాడి.. బంగారం అపహరణ

image

మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఒంటరిగా ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి రాజేశ్వరి (55)పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. శనివారం జరిగిన ఈ ఘటనలో దుండగుడు ఆమె తలపై కర్రతో కొట్టగా స్పృహ కోల్పోయింది. తర్వాత గొలుసు తెంపుకొని పారిపోయాడు. రాజేశ్వరి నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 20, 2025

కడప: 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ SP శ్రీనివాస్ వివరాల మేరకు.. కడప(D) ప్రొద్దుటూరు-జమ్మలమడుగు దారిలో వాహనాల తనిఖీ చేపట్టగా పెద్దశెట్టిపల్లి వద్ద కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది చుట్టుముట్టి నిందితులు, 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 20, 2025

ఒంగోలు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

image

ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. హౌరా నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అబ్దుల్ హుదూద్ వద్ద 1.5 కిలోల గంజాయిని గుర్తించారు. మరో 38 చిన్న గంజా ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని GRP పోలీసులకు అప్పగించారు.

News September 20, 2025

విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

image

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.

News September 20, 2025

విశాఖలో నాలుగు కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

image

విశాఖ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు 4 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విశాఖ-గోపాలపట్నం, దువ్వాడ-ఉత్తర సింహాచలం, వడ్లపూడి-గేట్‌ కేబిన్‌ జంక్షన్ మార్గాల్లో కొత్త లైన్లు రానున్నాయి. పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య పైవంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల ఆలస్యం తగ్గి, రన్నింగ్ టైమ్ కుదించడంతో పాటు వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు.