Andhra Pradesh

News March 27, 2024

సూళ్లూరుపేట గోకులకృష్ణ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం

image

సూళ్లూరుపేట సమీపంలోని గోకులకృష్ణ కాలేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి సూళ్లూరుపేటకు వెళ్తూ గోకుల్ కృష్ణ కాలేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవ్వరికి ప్రాణ నష్టం జరగలేదు.

News March 27, 2024

విశాఖ: ఇగ్నోలో అడ్మిషన్లకు గడువు పెంపు

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వర్సిటీ గాజువాక స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎస్వీ కృష్ణ తెలిపారు. యూనివర్సిటీ అందిస్తున్న అన్ని సర్టిఫికెట్, డిప్లమా, పీజీ డిప్లమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎంబీఏ ప్రవేశాలకు అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0891-3514734 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.

News March 27, 2024

నంద్యాల జిల్లాలో 28న CM, 29న మాజీ CM పర్యటన

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ YCP, TDP అగ్రనేతలు గెలుపే ప్రధాన ఏజెండాగా పావులు కదుపుతున్నారు. ఈనెల 28న CM వైఎస్ జగన్ నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్ర చేపడుతుండగా, మరోవైపు మాజీ CM నారా చంద్రబాబు ఈనెల 29న ‘ప్రజాగళం’ పేరిట బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు తమ పార్టీ శ్రేణులలో వరుస కార్యక్రమాలతో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు.

News March 27, 2024

VZM: ఏప్రిల్ 4 నుంచి సదరం స్లాట్ బుకింగ్ లు

image

సదరం ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధిత ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అందరూ మీ దగ్గర లో ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. > SHARE IT

News March 27, 2024

బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్

image

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బెస్ట్ పోలీసింగ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అవార్డును అందించనున్నారు.

News March 27, 2024

ప్రకాశం: 8న సాగర్‌ జలాల విడుదలకు అవకాశం

image

జిల్లాలో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేశ్ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీ సాగర్‌ జలాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు చోరీకి గురికాకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పహారాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేతి పంపుల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.

News March 27, 2024

విశాఖ: ధోనీ క్రేజ్.. ఓపెన్ అయిన గంటలోనే..!

image

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

News March 27, 2024

విజయనగరం: రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో కలెక్టర్ సమావేశం

image

ఏప్రెల్ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు న‌మోదు కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి సూచించారు. ఇలా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను 25వ తేదీలోగా ప‌రిశీలించి, అర్హులైన‌వారికి ఓటుహ‌క్కు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం క‌లెక్ట‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ఓట‌ర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.

News March 27, 2024

కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డు మూసివేత

image

కాకినాడ సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డును మూసివేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. వాహనాలను తిమ్మాపురం అచ్చంపేట కూడలి నుంచి పిఠాపురం మళ్లిస్తున్నామని.. వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.

News March 27, 2024

కృష్ణా : ఈ నెల 30తో ముగియనున్న ధాన్యం కొనుగోళ్ల గడువు

image

ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.