India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్‌కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.
తనను పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని గంటలు నగరంలో తిప్పడంతో కోపం, బాధతో సీఎం చంద్రబాబును ఏకవచనంతో తూలనాడానని, ఇది తప్పేనని, అవసరమైతే ఆయనకు క్షమాపణ చెబుతానని మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. ఈ మేరకు హర్ష ఒక వీడియో విడుదల చేసి పశ్చాతాప పడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి పిలుపివ్వడంతో తనను అరెస్టు చేయడం బాధ అనిపించినా, పోలీసులు తనను గౌరవంగా చూశారన్నారు.
తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి మండలం, పోచవరానికి చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తానని ఆయన అన్నారు.
కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.
ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త శశిభూషణ్ గురువారం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థుల సమీప స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9703585990 నంబరుని సంప్రదించాలని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో గురువారం ప్రమాదం జరిగింది. ఘటనలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.