Andhra Pradesh

News April 24, 2024

వినుకొండ: టెన్త్ విద్యార్థినికి 594 మార్కులు

image

వినుకొండ పట్టణంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పి.ఇష్రత్ ఫాతిమా పది పరీక్షలలో సత్తా చాటింది. 600 మార్కులకు గానూ 594 మార్కులు సాధించి వినుకొండ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

News April 24, 2024

గుంటూరు తూర్పులో ఆరుగురు అభ్యర్థులు 11 నామినేషన్లు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోమవారం 6 అభ్యర్థులు 11 సెట్లు నామినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. 1. షేక్ ముంతాజ్ , ఇండిపెండెంట్ 2. సయ్యద్ జావేద్, ఇండిపెండెంట్ 3. మహ్మద్ నజీర్, తెలుగుదేశం (2 సెట్లు) 4. మహ్మద్ రఫీ, ఇండిపెండెంట్ 5. షేక్ అల్తాఫ్ హుస్సేన్, ఇండియన్ లీగల్ ముస్లిం పార్టీ (4 సెట్లు). 6. షేక్ మస్తాన్ వలి, కాంగ్రెస్ (2 సెట్లు) రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరికి అందించారు.

News April 24, 2024

తిరుపతి పార్లమెంట్ పరిధిలో 46 నామినేషన్లు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, ఓ ఎంపీ స్థానానికి సోమవారం 46 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎంపీ స్థానానికి 5 మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 25 వరకు నామినేషన్ సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

News April 24, 2024

విశాఖ: సీఎం జగన్ రేపు బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

image

ఎండాడ బస కేంద్రం నుంచి మంగళవారం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తర్వాత బొడ్డువలస మీదుగా సాయంత్రం చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకొని రాత్రి బస చేస్తారు.

News April 24, 2024

ప.గో.: 43948 పరీక్ష రాశారు.. 35556 పాస్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 43,948 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో ఏలూరు జిల్లాలో బాలురులు 8,513, బాలికలు 10,036 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప.గో లో బాలురు 8,262, బాలికలు 8,745 మంది ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ అధికారులు సోమవారం తెలిపారు.

News April 24, 2024

మాగుంట విజయ్ రెడ్డి మృతి

image

మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామ రెడ్డి, పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి (విజయ్ బాబు) చనిపోయారు. నెల్లూరులోని అపోలోలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయ్ రెడ్డికి బాబాయి అవుతారు.

News April 24, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ వేసింది వీరే..

image

➤ పలాస: YCP అప్పలరాజు
➤ ఇచ్ఛాపురం: స్వతంత్రంగా లక్ష్మీ
➤ టెక్కలి: TDP అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం: TDP శంకర్, INCP కృష్ణారావు,
➤ ఆమదాలవలస: YCP సీతారాం, INCP అన్నాజీ రావు, BSP సోమేశ్వరరావు, స్వతంత్రంగా సురేశ్
➤ పాతపట్నం: YCP రెడ్డి శాంతి, కూటమి మామిడి గోవిందరావు
➤ ఎచ్చెర్ల: PPI నీలాచలం, JBNP కొర్లయ్య, INCP మల్లేశ్వరరావు,
➤ నరసన్నపేట: YCP కృష్ణదాస్, NCP కామేశ్వరి, INCP నరసింహ మూర్తి.

News April 24, 2024

ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి రామాలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణాన్ని  అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది.

News April 24, 2024

మహానంది: న్యూసెన్స్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష

image

మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం వద్ద ఈలలు, కేకలు వేస్తూ ప్రజా శాంతికి భంగం కలిగించిన ముగ్గురిపై ఈ నెల 17న మహానంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొల్లవరం గ్రామానికి చెందిన గుండా మధు, పలుకూరు జమాన్ మధు, తమ్మడపల్లె అశోక్ లను ముగ్గురిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News April 24, 2024

బై‌క్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

image

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.