Andhra Pradesh

News April 21, 2024

గుంటూరు: 6.5కిలోల వెండిని సీజ్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్  

image

జిల్లాలో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.4,60,880ల విలువ గల 6584 గ్రాముల వెండి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 21 వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,31,26,840ల  నగదు, మద్యం జప్తు చేశామన్నారు. 

News April 21, 2024

ప.గో.: ఒకే వేదికపై RRR, మంతెన రామరాజు

image

ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా TDP తొలుత సిట్టింగ్ MLA మంతెన రామరాజు పేరును ఖరారు చేసి, తర్వాత ఆ స్థానం నుంచి రఘురామకృష్ణను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..ఈ రోజు కాళ్ళ మండలం జక్కరంలో కూటమి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారిద్దరూ ఒకేవేదికను పంచుకొన్నారు. ఈ సందర్భంగా నవ్వులు చిందిస్తూ ముచ్చటించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. సమన్వయంతో పనిచేసి గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 21, 2024

టీడీపీ ఉపాధ్యక్షుడిగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియమితులయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికే చెందిన పుట్టం బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు.

News April 21, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 21, 2024

గుంటూరులో వృద్ధురాలి మృతి.. కేసు నమోదు

image

గుంటూరులో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సుమారు 70 సంవత్సరాలు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు సంగడిగుంట లాంచర్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీసులకు తెలియజేయాలని అన్నారు.

News April 21, 2024

కోనసీమ: లారీ బోల్తా.. వ్యక్తి మృతి

image

కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో ఆదివారం లారీ బోల్తాపి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపేటకు చెందిన పెద్దరెడ్డి రాజు చొప్పెల్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద మట్టితో ఉన్న లారీ అన్లోడింగ్ చేయడానికి వాహనాన్ని వెనుక వైపు కదిలించగా ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. దీంతో రాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. 

News April 21, 2024

ప్రకాశం: రైలు ఢీకొని యువకుడు మృతి

image

వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను దాటుతున్న ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, మట్టి కలర్ చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. యువకుడి వివరాలు తెలిస్తే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

News April 21, 2024

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశా నిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా సంబంధిత అధికారులదే బాధ్యత అన్నారు.

News April 21, 2024

కడప: రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

image

జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో నామినేషన్లు నమోదుకాలేదు. సోమవారం ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేస్తున్నవారు. వారిలో
➤ కడప TDP MP అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
➤ JMD-సుధీర్ రెడ్డి
➤ PDTR-రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
➤ బద్వేల్-దాసరి సుధ, విజయ జ్యోతి
➤ కమలాపురం-పి.రవీంద్ర నాథ్ రెడ్డి
➤ మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
➤ 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ వేయనున్నారు.

News April 21, 2024

ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథిపై ఆదివారం కేసు నమోదైందని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఆ సమయంలో ఐదుగురికి బదులు 8 మంది వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, సూరం భాస్కర్ రెడ్డి, మరో నలుగురిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.