Andhra Pradesh

News April 21, 2024

దేశంలో ఆ ఘనత ఒంటిమిట్ట రాములోరి సొంతం

image

ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి, లక్ష్మణులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరొచ్చింది. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

News April 21, 2024

ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్థులకు బీఫాంలు అందజేత

image

ప్రకాశం జిల్లా TDP అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీ-ఫారంలు అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని TDP అభ్యర్థులకు ఒంగోలు-జనార్ధన్, మార్కాపురం-కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు-అశోక్ రెడ్డి, కనిగిరి-ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి-గొట్టిపాటి లక్ష్మి, కొండపి-డోలా బాల వీరాంజనేయ స్వామి. వైపాలెం-గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంటకు అందజేశారు.

News April 21, 2024

ఏలూరు: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు

image

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు SI జ్యోతిబసు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బాలిక(10) ఈ నెల 19న పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఎవరూ లేరని తెలుసుకుని పట్టణానికి చెందిన అంజత్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. తల్లికి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

News April 21, 2024

మైలవరం వైసీపీ అభ్యర్థి సామాన్యుడే 

image

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు ఆస్తి వివరాలు చూస్తే సామాన్యుడే అని అన్నట్లుగా అనిపిస్తుంది. కెనరా బ్యాంకులో ఉన్న అకౌంట్లో రూ.1000, మైలవరం మండల పుల్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూ.9,823 ఉన్నట్లు చూపించారు. తన పేరుతో రూ.73,531 విలువైన 2016 మోడల్ బైకు, రూ.55,200 విలువైన 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంగా రూ.50 వేలు ఉన్నట్లు పొందుపరిచారు. 

News April 21, 2024

ఉండి బరిలో వీరే.. గెలుపు ఎవరిదో..?

image

ఉండి కూటమి అభ్యర్థిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ నేటితో వీడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామ కృష్ణ రాజును ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో ముగ్గురు రాజుల మధ్య పోటీ నెలకొననుంది.  రఘురామ కృష్ణరాజు కూటమి నుంచి, వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు, స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకటశివరామరాజు నిలిచారు. మరి గెలుపు ఎవరిదో వేచి చూడాల్సిందే..?

News April 21, 2024

దర్శిలో టీడీపీ నేతకు ప్రమాదం.. స్పందించిన నారా లోకేశ్

image

దర్శి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. నాదెండ్ల బ్రహ్మం ప్రమాదంలో గాయపడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఫోన్లో వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. బ్రహ్మంకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News April 21, 2024

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి ఆస్తుల వివరాలు

image

☞ విద్యార్హతలు: B.A (Literature)
☞ భర్త: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
☞ కేసులు, వ్యవసాయ భూమి, వాహనం లేవు.
☞ చరాస్తులు: రూ.11.75కోట్లు (కుటుంబీకులందరివి కలిపి)
☞ స్థిరాస్తులు: రూ.49.70 కోట్లు (కుటుంబీకులందరివి)
☞ బంగారం: 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10గ్రా ముత్యాలు (రూ.1.19 కోట్లు).
☞ HYD బంజారాహిల్స్‌‌లో ఇల్లు(రూ.5.55 కోట్లు).
☞ అప్పులు: రూ.6.73 కోట్లు.
➠ తాజా అఫిడవిట్ వివరాల ప్రకారం

News April 21, 2024

బగ్గు రమణమూర్తి ఆస్తులివే..

image

*అభ్యర్థి పేరు: బగ్గు రమణమూర్తి
*నియోజకవర్గం:నరసన్నపేట
*పార్టీ: టీడీపీ
*కేసులు: లేవు
*చరాస్తులు: రూ.2.38 కోట్లు
*స్థిరాస్తులు: రూ.64.09 కోట్లు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.3.50కోట్లు
*రుణాలు:రూ.63.25 లక్షలు
NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 21, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

ఏలూరు నుంచి కర్నూలుకు వస్తున్న క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనం గిద్దలూరు ఘాట్ రోడ్ బొగద మలుపు వద్ద ఆదివారం తెల్లవారుజామున కొండచరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఏలూరు నుంచి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండచరియను ఢీకొంది. ఆ సమయంలో డ్రైవర్ పెద్దరాజు కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు.

News April 21, 2024

నెల్లూరు: సచివాలయంలో మద్యం సీసాలు

image

నెల్లూరు జిల్లాలోని ఓ సచివాలయంలోనే మద్యం సీసాలు దొరకడం కలకలం రేపుతోంది. కావలి పట్టణ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు నిల్వ చేసినట్లు సీ-విజిల్ యాప్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సచివాలయంలో తనిఖీలు చేశారు. 43 మద్యం సీసాలను గుర్తించారు. వాటిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.