India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చౌడేపల్లి మండలం చారాల గ్రామం, పరికిదోన సచివాలయ పరిధిలో సుమారు 30 మంది వాలంటీర్లు చౌడేపల్లి ఎంపీడీవోకి రాజీనామాలు సమర్పించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు, పవన్, బీజేపీ నీచ రాజకీయాలకు మేము మనస్తాపం చెంది రాజీనామాలు సమర్పించామని తెలియజేశారు. సీఎం జగన్ గెలుపుకోసం పనిచేస్తామన్నారు.

కాపుల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తణుకులోని కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమారుడికి ఎంపీ సీటు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని జీవితంలో మర్చిపోలేనని అన్నారు.

ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో కరెంట్ బిల్లు చూసి బాధితులు శనివారం కంగుతిన్నారు. పప్పల ముకుందరావు అనే వారి ఇంటి కరెంట్ బిల్లు రూ.1,22,206 వచ్చింది. చిన్న ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. వారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో మేము ఎలా కట్టేది అని ఇంటి యజమాని లబోదిబోమంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు బతుకుదెరువు కోసం వేరే ఊరిలో ఉంటున్నారు. సంబంధిత అధికారుల తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గుంటూరు నగర శివారు జాతీయ రహదారి అంకిరెడ్డిపాలెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చేరెడ్డి జగన్మోహనరావు (61) మృతి చెందాడు. జాతీయ రహదారి పక్కన పూల బస్తాలను తరలించే క్రమంలో ఇతను ఆటోదిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి అతణ్ని ఢీకొంది. ఈ ఘటనలో జగన్మోహనరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఏడుకొండలు కేసు నమోదు చేశారు.

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవ భేరి మోగింది. ఉగాది మహోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. చంఢీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేసి కంకణాలు ధరించారు. రుత్వికులు దీక్ష వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉమ్మడి ప.గో.లో గెలుపే లక్ష్యంగా YCP, TDP కూటమి MLA అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్ల కేటాయింపు అయ్యాక చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని YCPవిజయరాజుకు టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. తాజాగా ఉండిలో TDP సైతం MLAమంతెన రామరాజును కాదని ఎంపీ RRRకు టికెట్ ఇచ్చింది. ఇప్పటికే రామరాజు అనుచరులు ఆందోళనలకు సిద్ధం కాగా ఆయనకు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూడాలి.

పెదపాడు మండలం రామచంద్ర కళాశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడ్డివాము ట్రాక్టర్‌ని లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ రెండు ముక్కలుగా విడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

విద్యుత్ షాక్‌తో ఎలుగుబంటి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద అరటి తోటకు పెట్టిన విద్యుత్ వైరు తగిలి మృతిచెందినట్లు డిఆర్ఓ హైమావతి తెలిపారు. రేంజ్ ఆఫీసర్ వీఆర్వో సమక్షంలో పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయించి దహనం చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.

రణస్థలం మండలం జే.ఆర్.పురం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలోని 48 మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా శనివారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.