Andhra Pradesh

News March 29, 2024

VZM: అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చి మృత్యు ఒడిలోకి

image

రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి బైక్‌పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు, పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు. మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

News March 29, 2024

రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News March 29, 2024

విశాఖ: అప్పన్న తలనీలాల వేలం రూ.10.13 కోట్లు

image

సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.

News March 29, 2024

అనంత: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆర్ట్స్‌ కళాశాలలో డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలను ప్రిన్సిపాల్ దివాకర్‌ రెడ్డి విడుదల చేశారు. 5వ సెమిస్టర్‌లో 1,261 మందికి గాను 862 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆర్ట్స్‌లో 60 శాతం, కామర్స్‌‌లో 74 శాతం, సైన్స్‌లో 71 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 3వ సెమిస్టర్‌లో 855 మందికి గాను 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్‌లో 1,028 గాను 657 మంది పాసైనట్లు తెలిపారు.

News March 29, 2024

ఆ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అందులో తాడిపత్రిలో అత్యధికంగా 41.4 డిగ్రీలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. గుంతకల్ 41.2 శింగనమల41.1, పరిగి 40.9 శెట్టూరు 40.8, గుత్తి, చెన్నేకొత్త పల్లి, కనగానపల్లి 40.7, ధర్మవరం 40.6 నమోదైనట్లు తెలిపారు.

News March 29, 2024

విశాఖ నుంచి అందుబాటులోకి కొత్త విమాన సర్వీసులు

image

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు అంతర్జాతీయ, రెండు దేశీయ విమానం సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి విశాఖ బ్యాంక్, 26 నుంచి కౌలాలంపూర్ విశాఖ, మార్చి 31 నుంచి విశాఖ ఢిల్లీ, విశాఖ హైదరాబాద్ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఆయా సర్వీసులకు సంబంధించి టికెట్లు ప్రస్తుతం ఆల్ లైన్ లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

News March 29, 2024

విశాఖ: మరికొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సర్వీస్‌ ఓటర్లతోపాటు మరికొన్ని వర్గాలకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రధానంగా 80 ఏళ్లు దాటిన వారిని, దివ్యాంగులను (40 శాతానికి పైబడి వైకల్యం కలిగిన), విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులను పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేవారి జాబితాలో చేర్చారు. దీంతో జిల్లాలో 30 వేల మందికి పైబడి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

News March 29, 2024

VZM: 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టి‌ఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.