Andhra Pradesh

News March 29, 2024

దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కడియాల లక్ష్మి

image

నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు కోడలు డాక్టర్ కడియాల లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి గొట్టిపాటి నరసయ్య కూతురు.

News March 29, 2024

ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..?

image

రానున్న ఎన్నికల్లో ఏపీలో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలి విడతగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు చెరో 15 అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

News March 29, 2024

TDPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇచ్చారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం జగన్‌ను కలిసి చేరికపై చర్చించినట్లు సమాచారం.

News March 29, 2024

ప్రకాశం టీడీపీలో ముగ్గురు డాక్టర్లు పోటీ

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  టీడీపీ తరఫున జిల్లాలో ముగ్గురు డాక్టర్లు పోటీ చేస్తున్నారు. ముగ్గురు పూర్తిగా వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవలందించారు. కొండపిలో బాలవీరాంజనేయస్వామి ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే కనిగిరిలో కాంగ్రెస్ తరఫున ఉగ్రనరసింహారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా దర్శి నుంచి వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు.

News March 29, 2024

రాజంపేటలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

image

రాజంపేటలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేయడంపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేయడంతో పాటు పలువురు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇన్నిరోజులుగా పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో పట్టు తీసుకొచ్చిన భత్యాల చాంగల్రాయుడుకు సీటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో ఆయన అనుచరులు మండిపడ్డారు.

News March 29, 2024

దేవినేని ఉమాకు వసంత బర్త్‌డే విషెస్

image

మైలవరం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బర్త్ డే విషెస్ తెలిపారు. మైలవరం టికెట్ ఉమా ఆశించగా.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంతకే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఎదురుపడిన దాఖలాలు లేవు. ఈక్రమంలో ఉమాకు వసంత విషెస్ చెప్పడం గమనార్హం.

News March 29, 2024

VZM: కేబీఆర్ భవిష్యత్ కార్యాచరణపై నేడు కీలక ప్రకటన

image

నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన అనుచరులతో ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గ టికెట్‌ను ఆయన ఆశించగా పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. భీమిలి ఎమ్మెల్యే టికెట్ లేదా విజయనగరం ఎంపీ టికెట్‌ను కేటాయిస్తారని ఆశతో ఎదురుచూసినప్పటికీ ప్రకటించకపోవడంతో అత్యవసర సమావేశానికి తన అనుచరులకు పిలుపునిచ్చారు.

News March 29, 2024

కావలికి చేరుకున్న చంద్రబాబు

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

News March 29, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట

image

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

News March 29, 2024

ఎచ్చెర్ల TO విజయనగరం

image

ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎచ్చెర్ల MLA టికెట్ ఆశించిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుకు ఆ పార్టీ విజయనగరంలో అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీగా కలిశెట్టి, చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా పోటీ చేయనున్నారు. ఇన్ని రోజులు ఎచ్చెర్ల స్థానం కోసం వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. మరి ఆ ఇద్దరూ అక్కడ ఎలా వ్యహరిస్తారో చూడాలి మరి.