Andhra Pradesh

News March 31, 2024

VZM: కేంద్ర మాజీ మంత్రిని కలిసిన కూటమి అభ్యర్థులు

image

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కూటమి అభ్యర్థులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి.. ఆయన బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి మద్దతు పలకాలని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

News March 31, 2024

కడప: అసంతృప్తి నేతలు పార్టీ గెలుపునకు సహకరించేనా.?

image

ఉమ్మడి కడప జిల్లాలో TDP వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందని, ఆ మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు సీటు దక్కని నేతలు బహిర్గతంగానే పార్టీపై విమర్శలు చేశారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు నాయకులు ఆ కోవలోనే ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు వారు ఎంతవరకు సహకరిస్తారో అని చర్చ ఉంది. అయితే ఇప్పటికే అసమ్మతి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టింది.

News March 31, 2024

వాలంటీర్లను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు: లోకేశ్

image

తాడేపల్లి మండలం కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సమావేశమయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్ఠం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు.

News March 31, 2024

విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ రాజకీయ ప్రస్థానం ఇదే 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ను ప్రకటించారు. 2009లో ప్రజారాజ్యం తరుఫున పోటీచేసి ఆయన ఓడిపోయారు. 2011లో వైసీపీలో చేరి 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో 2021లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

News March 31, 2024

సాక్ష్యం యాప్ పై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులైన ఓటర్లు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఓటు హక్కు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ హెల్ప్ లైన్ డెస్క్, బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ షీట్, సహాయకుడిని అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ విధానంపై రూపొందించిన సాక్ష్యం యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.

News March 31, 2024

కంచికచర్ల: భర్త, అత్తమామల వేధింపులకు వివాహిత బలి

image

మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిని పెనుగంచిప్రోలు మండలం కొనకంచికి చెందిన సతీశ్‌తో గత ఏడాది వివాహం చేశారు. శ్రీలక్ష్మికి 2సార్లు గర్భస్రావం కావడంతో భవిష్యత్తులో పిల్లలు పుట్టరని భర్త, అత్తమామలు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 31, 2024

ఉదయగిరి: 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

image

ఉదయగిరి మండలంలో ఏప్రిల్ 3 నుంచి 8వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది వితంతు వృద్ధాప్య దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. మండలంలో 194 మంది వాలంటీర్లు ఉండగా వారి నుంచి మొబైల్ సిమ్ బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

News March 31, 2024

విజయవాడ: పోలీసులకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సీపీ క్రాంతి రానా టాటా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నగరంలో పనిచేస్తున్న కింది స్థాయి పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలు ఆరోపణలు రావడంతో సీపీ శనివారం ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిబ్బంది ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 31, 2024

విజయనగరం: ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు పలువురు దూరం..!

image

కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించడంలో పలువురు టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు. విజయనగరంలో కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజు, బొబ్బిలిలో తమ్ముడు పోటీలో ఉండడంతో సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరంలో అన్న కొడుకు అభ్యర్థి కావడంతో కొండపల్లి అప్పలనాయుడు, చీపురుపల్లి సీటు పెదనాన్నకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరం అయ్యినట్లే కనిపిస్తుంది.

News March 31, 2024

నేడు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం సామర్థ్యం 28,000 కాగా వాహనాల్లో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు మధురవాడ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.