India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎచ్చెర్ల MLA టికెట్ ఆశించిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుకు ఆ పార్టీ విజయనగరంలో అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీగా కలిశెట్టి, చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా పోటీ చేయనున్నారు. ఇన్ని రోజులు ఎచ్చెర్ల స్థానం కోసం వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. మరి ఆ ఇద్దరూ అక్కడ ఎలా వ్యహరిస్తారో చూడాలి మరి.

అన్నమయ్య జిల్లాలోని రాజంపేట TDP ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాను విడుదల చేయగా.. ఇందులో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రకటించింది. రాజంపేట వైసీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న బత్యాలకు భంగపాటు ఏర్పడింది.

భీమిలి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన గంటా శ్రీనివాసరావుకు ఓటమి ఎరుగని నేతగా పేరుంది. 1999 ఆయన అనకాపల్లి నుంచి మొదటిసారిగా టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. 2014లో మళ్లీ టీడీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పెనమలూరులో నేడు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని క్రైస్తవ మందిరాల్లో ప్రార్థనలునిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బోడె ప్రసాద్ బూట్లు వేసుకొని సిలువ మోయడం క్రైస్తవులకు అవమానించడమేనన్నారు. ఆయన వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భూపేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కాసేపటి క్రితం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో భూపేశ్‌కు కడప ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. భూపేశ్ విజయానికి కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 95 ఫిర్యాదులు రాగా అందులో 65 సహేతుకమైన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సృజన చెప్పారు. 53 ఫిర్యాదులను నిర్దేశించిన 100 నిమిషాల్లో పరిష్కరించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 20మంది వాలంటీర్లు, డీఆర్ డీఏ-వైకేపీ ఆర్పీ ఒకరు, నగరపాలక సంస్థ డ్రైవర్ (ఆప్కాస్) ఒకరు, హెచ్. కైరవాడి సహకార సొసైటీ అటెండర్ ఒకరు కలిపి 23మంది తొలగించామన్నారు

ఆలూరు TDP MLA టికెట్ వీరభద్ర గౌడ్‌కు టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అటు ఇటీవలే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా.. ఆదోనికి కూటమిలో భాగంగా BJP అభ్యర్థి పార్థసారథిని ప్రకటించారు.

దర్శి సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని చాలా రోజులు అటు ప్రజల్లో, ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ దర్శి కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారయింది. ఈమె మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. దర్శి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటివరకు అనేకమంది పేర్లు ప్రచారం పొందగా నేటితో ఆ ఉత్కంఠకు తెరపడింది.

కూటమి చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంటకరావును, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. వీరిద్దరూ ఆశించిన ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయించారు. కాగా.. చీపురుపల్లిలో పోటీ చేస్తారన్న గంటాకు భీమిలి సీటు కేటాయించింది. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కిమిడి నాగార్జునకు కళా స్వయానా పెదనాన్న అవుతారు.

అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈయనకు బోయ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. హిందూపురం పార్లమెంట్ స్థానం ఆశించారు, కానీ టీడీపీ అధిష్ఠానం అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది.
Sorry, no posts matched your criteria.