Andhra Pradesh

News March 31, 2024

ఏలూరు: తనిఖీలు.. రూ.81.76 లక్షలు సీజ్

image

సీ-విజిల్ యాప్‌లో ఇప్పటివరకు అందిన 181 ఫిర్యాదులలో 95 ఫిర్యాదులను పరిష్కరించామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మరో 86 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు రాగా వాటిని తిరస్కరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తంగా రూ.81.76 లక్షల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు. జిల్లాలో నిరంతరంగా సర్వేలైన్స్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు.

News March 31, 2024

పొల్లూరు జలపాతంలో పడి వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ఓ పర్యాటకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు కావడంతో తూగో జిల్లా రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వచ్చారు. వారిలో కొండయ్య(33) అనే పర్యాటకుడు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడ్డాడు. స్నేహితులు హుటాహుటీన మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 31, 2024

రూ.2.49 కోట్లు స్వాధీనం: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

News March 31, 2024

కడప: అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

image

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత కొద్ది నెలల క్రితం పులివెందులలోని జెండా మాను వీధిలో తన భార్యను హత్య చేసిన కేసులో అనుమానితుడిగా కానిస్టేబుల్ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికుల సమాచారం ద్వారా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

News March 31, 2024

ధర్మవరంలో విద్యార్థిని సూసైడ్

image

ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన చింత చిదంబరయ్య కుమార్తె చింత రాజేశ్వరి(21) ఆదివారం ఉరివేసుకుని మృతిచెందింది. రాజేశ్వరి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆదివారం కూడా నొప్పి రావడంతో భరించలేక ఇంట్లో చీరతో ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

News March 31, 2024

కైకలూరు: నాటు తుపాకీ కలిగిన ఇద్దరి అరెస్టు

image

ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2024

తూ.గో. జిల్లాలో తొలిసారి బరిలో.. గెలిచి నిలిచేనా..?

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలోని 19స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తొలిసారి పోటీచేస్తున్నవారు 9 మంది ఉండటం విశేషం. జనసేన నుంచి బత్తుల రామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, దేవవరప్రసాద్, YCP నుంచి పిల్లి సూర్యప్రకాశ్, TDP నుంచి యనమల దివ్య, వాసంశెట్టి సుభాష్, మిర్యాల శిరీష, ఆదిరెడ్డి వాసు, BJP- శివకృష్ణంరాజు ఉన్నారు. గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News March 31, 2024

అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

నెల్లూరు: వేసవిలో మండుతున్న పుచ్చకాయ ధరలు

image

జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి  రూ.100 నుంచి రూ.150 వరకు  విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

News March 31, 2024

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు

image

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.