Andhra Pradesh

News April 1, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 113 ఏళ్లు

image

1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.

News April 1, 2024

పాలకొండ: చెరువులో పడి వ్యక్తి గల్లంతు

image

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

శ్రీ సత్యసాయి: జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

image

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోమవారం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు వైసీపీలో చేరారు. చిలమత్తూరు మాజీ ఎంపీపీ ఆన్సర్, లేపాక్షి మాజీ ఎంపీపీ హనోక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు.

News April 1, 2024

విశాఖ: ‘పెన్షన్లు అడ్డుకోవడం సమంజసం కాదు’

image

రాష్ట్రంలో 60 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఆ రెండు పత్రికలు ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఆ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నది తప్పని విమర్శించారు. దేవుడు క్షమించడని అన్నారు.

News April 1, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో TDP, BJP సత్తా చాటగలవా?

image

గెలుపే లక్ష్యంగా అనేక సర్వేల అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 MP, 13 అసెంబ్లీ స్థానాలకు TDP, ఒక (ఆదోని) స్థానానికి BJP అధినేతలు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సర్వేల రిపోర్టును బట్టి YCP బలాలు, బలహీనతల దృష్ట్యా పలుచోట్ల అభ్యర్థులను మార్చారు. చంద్రబాబు నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.

News April 1, 2024

విశాఖ:’ఖజానా ఖాళీ.. పెన్షన్లకు సొమ్ము లేదు’

image

రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. దీంతో పెన్షన్ సొమ్ము పంపిణీ 4వ తేదీకి వాయిదా వేసినట్లు విమర్శించారు. పెన్షన్ సొమ్ముతో పాటు వాలంటీర్లతో అక్రమంగా నగదు పంచే ఆలోచన కూడా వైసీపీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశించిందని అన్నారు.

News April 1, 2024

కాశినాయన: మహిళ అదృశ్యంపై ఫిర్యాదు నమోదు

image

కాశినాయన మండలం బాలయ్య పల్లెకు చెందిన బసిరెడ్డి స్వర్ణలత 16 రోజుల నుంచి కనిపించ లేదని కుటుంబీకులు తెలిపారు. వారు వెతికినా ఆచూకీ లభించలేదని కాశి నాయన మండలం ఎస్సై అమర్నాథ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9121100660 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

News April 1, 2024

శ్రీకాకుళం: పనసకు మంచి గిరాకీ

image

జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్‌, కటక్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.

News April 1, 2024

ధర్మారెడ్డి అహోబిలానికి రాలేదు: పీఠాధిపతి

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలను అహోబిల మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఖండించారు. తిరుమల స్వామివారిని సోమవారం ద‌ర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో ఎన్నడూ ధర్మారెడ్డి తమ పీఠానికి రాలేదని చెప్పారు. అహోబిలం పీఠాధిపతి శ్రీశైలం గుహల్లో గుప్తనిధుల కోసం ప్రయత్నించారనే ఆరోపణలతో అప్పట్లో ఓ వీడియో వైరల్ అయ్యింది.

News April 1, 2024

నెల్లూరు: ఎల్లుండి నుంచి పెన్షన్లు పంపిణీ

image

వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు, ఫోన్లు వెంటనే స్వాధీనం చేసుకోవాలని నెల్లూరు జడ్పీ సీఈవో కన్నమ నాయుడు ఆదేశించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.