India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.
విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్‌రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తూ.గో జిల్లా డీఈవో కంది వాసు దేవరావు అన్నారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో జరిగిన పాఠశాల క్రీడోత్సవాల సందర్భంగా అండర్-14, అండర్-17 బాక్సింగ్ బాలబాలికల ఎంపిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లా తరపున పాల్గొనే క్రీడాకారులు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
వాహన మిత్ర పథకం దరఖాస్తు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు. గతంలో (2023 వరకు) ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన వారు మరలా చేయాల్సిన అవసరం లేదన్నారు.
తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.
కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.
తూ.గో జిల్లా నూతన కలెక్టర్ చేకూరి కీర్తిని జిల్లా హెచ్ఎం సంఘం శుక్రవారం కలెక్టరేట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పూర్వ తూ.గో జిల్లాలో జేసీగా పనిచేసిన కాలంలో పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి గురించి ఆమె హెచ్ఎంలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ జిల్లా ఛైర్మన్ కాంతి ప్రసాద్, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు కోలా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణారావు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన నెల రోజుల్లో 13,35,656 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 65% పెరిగిందని, 4 రకాల బస్సుల్లో మొత్తం జీరో టిక్కెట్ రూ.4,85,01,735 అయినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.
నెల్లూరులోని వెంకటేశ్వరపురం మూడో రైల్వే లైనుపై ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. రైల్వే SI హరిచందన వివరాలు.. చిత్తూరు(D) పూతలపట్టుకు చెందిన ఉమేష్ చంద్ర(25), పొదలకూరుకు చెందిన వంశీ స్నేహితులు. వీరు గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమేష్ చంద్ర మృతిచెందగా, వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.