India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. సిరిపురం చిల్డ్రన్ ఏరీనాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో భక్తులకు రక్షణ కల్పించేందుకు టీడీపీ తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. ఒంటరిగా మెట్లదారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలని సూచించింది.

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరులో ఓ వ్యక్తిపై గొడ్డలి దాడి జరిగింది. గ్రామానికి చెందిన చిచ్చడి కృష్ణ(45) అనే వ్యక్తిపై కుర్సం వెంకటేష్ మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ తీవ్ర గాయాలపాలవ్వగా.. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.

ఆస్పరి-మొలగవల్లి ఆర్ఎస్ఎల్ఏ మధ్య కెఎం నెంబర్ 470/28 రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని, 3 రోజుల క్రితం రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెంది ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అన్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో అరుదైన ఘటన నెలకొంది. విశాఖలోని జీవీఎంసీ 19వ వార్డు ఎంపీపీ కాలనీ సెక్టార్ 12లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంవీవీ జయభారత్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణను కలిసి తమకు మద్దతు తెలపాలని ఆయనకు పార్టీ కరపత్రాన్ని ఇచ్చి ఎంవీవీ అభ్యర్థించారు.

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి తేలప్రోలు రైల్వే స్టేషన్ గేటు సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆది నారాయణ ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుడి చేయిపై ‘అమ్మ’ అని పచ్చ బొట్టు ఉందన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వంగా గీత 1994లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. TDPలో వర్గపోరుతో తొలుత ఆమెను అభ్యర్థిగా ప్రకటించినా బీఫారం వెన్నా నాగేశ్వర రావుకు అందించారు. అప్పట్లో ఆమెకు చంద్రబాబు, బాలయోగి ఆశీస్సులు ఉన్నా టికెట్ దక్కలేదు. నామినేషన్ తర్వాత బీఫారం కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్‌లో ఉండటంతో దాన్ని ఉపసంహరించుకునే ఛాన్స్ దక్కలేదు. ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నా ఎటువంటి ప్రచారం చేయలేదు. అయినా 169 ఓట్లు దక్కాయి.

భారత్ అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యానికి అనుగుణంగా విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో నౌకా దళం,వాయుసేన విన్యాసాలు ప్రారంభమైనట్లు అమెరికా రాయబారి ఎరిక్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. మంగళవారం లాంచనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు విన్యాసాలు కొనసాగుతున్నారు. ఇది దేశాలకు చెందిన 3000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత రత్నం అనారోగ్య కారణంగా బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని వారి నివాసం నందు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.
Sorry, no posts matched your criteria.