Andhra Pradesh

News April 2, 2024

కడప: అక్కడ సైకిల్ గుర్తు కనిపించదు

image

కడప జిల్లాలో 2 EVMలల్లో సైకిల్ గుర్తు కనిపించదు. పొత్తులో భాగంగా కోడూరు నుంచి భాస్కర్ రావు గాజు గ్లాసు గుర్తుమీద పోటీ చేస్తున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కోడూరు.. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఇక్కడ సైకిల్ గుర్తు ఈవీఎంలో ఉండదు. బద్వేలు, జమ్మలమడుగులో ఒక్క EVM(కడప ఎంపీ)లోనే సైకిల్ గుర్తు ఉండగా.. మిగిలిన 7 చోట్ల 2 ఈవీఎంలో TDP గుర్తు ఉంటుంది.

News April 2, 2024

విజయవాడ: ‘ఆ వాహనాలకు ఈ దారిలో అనుమతి లేదు’

image

విజయవాడ నగరంలో తిరిగే టిప్పర్ వాహనాల యజమానులతో పోలీస్ అధికారులు సోమవారం KS వ్యాస్ భవనంలో సమావేశమయ్యారు. గ్రావెల్ మొదలైన మెటీరియల్‌ను రవాణా చేసే టిప్పర్లు, కనకదుర్గ వారధి మీదుగా వారధి వైపునకు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. టిప్పర్లు గొల్లపూడి వై జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లాలన్నారు. టిప్పర్లపై టార్పాలిన్ కప్పి మెటీరియల్‌ రవాణా చేయాలని పోలీసులు టిప్పర్ల యజమానులను ఆదేశించారు.

News April 2, 2024

గిద్దలూరు: జనసేన పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్‌ఛార్జ్‌గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 2, 2024

అనకాపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు 

image

ఎస్.రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన కారే ఇస్సాక్ (25) పురుగుల తాగి సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విభీషణరావు చెప్పారు. ఒక యువతి విషయమై ఇస్సాక్‌‌ను ఆ కుటుంబ సభ్యులు తరచూ బెదిరించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆదివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

News April 2, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తు గడువు పెంపు

image

2024-25 విద్యా సంవత్సరంలో పార్వతీపురం మన్యంలో జిల్లా ఆదర్శ పాఠశాలలు అయిన భామిని, కురుపాం, ములక్కాయవలస (మక్కువ) పురోహితునివలస (సాలూరు)లో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ తెలిపారు. ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు మార్చి 31తో ముగియగా, ఏప్రిల్ 6వ తేది వరకు దరఖాస్తు గడువు తేదీ పెంచినట్లు ఆమె తెలిపారు.

News April 2, 2024

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందడం అభినందనీయం: ఎస్పీ

image

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు.
సోమవారం పదవీ విరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై టీఎస్ఎస్.ప్రసాద్ కుమార్‌ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు.

News April 2, 2024

తిరుపతి: వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేయండి

image

వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

News April 2, 2024

ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఓటు హక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, ఏప్రిల్ ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఈనెల 14వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని, దరఖాస్తు చేసుకుంటే నూతనంగా ఓటు పొందవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 10 రోజులలో పరిశీలించి కొత్త ఓటు హక్కు కల్పిస్తామన్నారు.

News April 2, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2024

నేడు కడపకు రానున్న YS షర్మిల

image

ఏపీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ తెలియజేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని, సాయంత్రం కడప అమీన్ మెమోరియల్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఆమె హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.